వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్గరగా మాట్లాడినా కరోనా వ్యాప్తి - అసెంబ్లీ స్పీకర్ అనూహ్య వ్యాఖ్యలు - ఆటాడుకున్న ఎమ్మెల్యేలు

|
Google Oneindia TeluguNews

'గో.. కరోనా.. గో..' నినాదం నుంచి నిన్నమొన్నటి 'భాబీజీ అప్పడాలు' వరకు కరోనా వైరస్ పై రాజకీయ నేతల వింత ప్రకటనలు ఎన్నో విన్నాం. తాజాగా బీజేపీకే చెందిన మరో నేత.. ''బిగ్గరగా మాట్లాడినా కరోనా వైరస్ వ్యాప్తిస్తుంది'' అని తీర్మానించారు. నిండు అసెంబ్లీలో సాక్ష్యాత్తూ స్పీకర్‌గారు చేసిన ఈ కామెంట్లకు ఎమ్మెల్యేలు ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు...

కస్టమర్ల చేతిలో క్యాబ్ డ్రైవర్ హతం -'జైశ్రీరాం'అనాలంటూ చంపేశారు-ఆడియో వైరల్-పోలీసుల వెర్షన్ వేరుకస్టమర్ల చేతిలో క్యాబ్ డ్రైవర్ హతం -'జైశ్రీరాం'అనాలంటూ చంపేశారు-ఆడియో వైరల్-పోలీసుల వెర్షన్ వేరు

కరోనా వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రానప్పటికీ.. ఆరు నెలల గడువు ముగుస్తుండటంతో పలు రాష్ట్రాలు అనివార్యంగానైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారం సభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభ ప్రారంభంలోనే కొవిడ్ నిబంధనలపై సభ్యులకు క్లాస్ తీసుకున్నారు స్పీకర్ విపిన్ సింగ్ పర్మార్.

Speaking loudly could help spread coronavirus: HP Assembly Speaker to MLAs

''స్లాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం సభలో బిగ్గరగా మాట్లాడితే కరోనా వైరస్ వ్యాపిస్తుంది. కాబట్టి సభ్యులందరూ చిన్నగా మాట్లాడి వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటారని ఆశిస్తున్నా" అని స్పీకర్ పర్మార్ ఎమ్మెల్యేలకు సూచించారు. ఆ వ్యాఖ్యలకు సభ ఒక్కసారే గొల్లుమంది. అనంతరం వివిధ అంశాలపై ఎమ్మల్యేలు.. ఒకరిని మించి మరొకరు బిగ్గరగా మాట్లాడుతూ.. స్పీకర్ ను ఆడుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా అరుపుల్లాంటి ప్రసంగాలతో రోజంతా సభ దద్దరిల్లింది. ఇదిలా ఉంటే,ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా అధికార బీజేపీ ఇందోరా ఎమ్మెల్యే రీటా దేవి కరోనా కాటుకు గురయ్యారు.

సోమవారం సభకు హాజరైన ఆమె.. సాయంత్రం టెస్టులు చేయించుకోగా, పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే రీటా దేవీ సభలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించిన కారణంగా మిగతా వాళ్లకు వైరస్ సోకలేదని వెల్లడైంది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రత్యేక స్వాగతం పలికారు.

Speaking loudly could help spread coronavirus: HP Assembly Speaker to MLAs

హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు 2.3లక్షల శాంపిళ్లను పరీక్ష చేయగా, మొత్తం 7,660 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది ప్రాణాలు కోల్పోయారు. 5,359 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 2234 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

English summary
Himachal Pradesh Assembly Speaker Vipin Singh Parmar on Tuesday said speaking loudly can help spread the novel coronavirus as he asked the MLAs to strictly abide by the Covid-19 protocol during the session. At the beginning of the Himachal Assembly session on the second day, Vipin Singh Parmar said, "As per standard operating procedure, speaking loudly could also help spread the virus. So, talk in a normal way to check spread of novel coronavirus."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X