వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ట్విస్ట్: సీబీఐ నుంచి రాకేష్ ఆస్థానా ఔట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్న రాకేష్ ఆస్థానాల మధ్య వివాదం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆస్థానాపై కేసు నమోదు కాగా, అలోక్ పైన అతను ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరిని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెలవులపై పంపించింది.

ఆ తర్వాత తనను సెలవులపై పంపించడంపై అలోక్ వర్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఒక రోజులోనే ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీం కోర్టు న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆయనను తొలగించింది.

 Special director Rakesh Asthana moved out of CBI

దీంతో అలోక్ వర్మ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా సీబీఐ నుంచి రాకేష్ ఆస్థానాను బదలీ చేశారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి ఆయనను బదలీ చేశారు. తనపై అవినీతి కేసు నమోదు చేయగా, దానిపై ఆస్థానా హైకోర్టుకు వెళ్లారు. కానీ ఆయనకు ఊరట దక్కలేదు.

English summary
The government on Thursday moved out CBI special director Rakesh Asthana from the agency. The tenure of three other senior officers of the probe agency has also been curtailed. Asthana is accused of taking bribes in the Moin Qureshi case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X