వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సభ ఎన్నికల్లో పోటీ విషయంలో సూపర్ స్టార్ క్లారిటీ, నటుడిగా సంతోషంగా ఉన్నా, ఫ్యాన్స్ ఫైర్ !

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలో తమ ప్రభావం పెంచుకోవడానికి బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేరళలోని సెలబ్రిటీలను బీజేపీలోకి ఆహ్వానించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేరళ హీరో, రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపి తరువాత సూపర్ స్టార్ మోహన్ లాల్ ను బీజేపీలోకి తీసుకురావాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.

అభిమానులు వ్యతిరేకం

అభిమానులు వ్యతిరేకం

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఓ. రాజగోపాల్ చెప్పారు. కేరళలోని మోహన్ లాల్ అభిమానులు బీజేపీ నుంచి పోటీ చెయ్యకూడదని డిమాండ్ చేస్తున్నారు. మోహన్ లాల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో గంధరగోళం నెలకొంది.

సుపర్ స్టార్ క్లారిటీ

సుపర్ స్టార్ క్లారిటీ

మోహన్ లాల్ కు చెందిన విశ్వశాంతి ఫౌండేషన్ తో కలిసి ఆర్ఎస్ఎస్ కు చెందిన జాతీయ సేవా సమితి కలిసి పని చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో మోహన్ లాల్ కచ్చితంగా బీజేపీ టిక్కెట్ మీద లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై హీరో మోహన్ లాల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నటుడిగానే కొనసాగుతున్నానని మోహన్ లాల్ వివరణ ఇచ్చారు.

బీజేపీ మాస్టర్ ప్లాన్

బీజేపీ మాస్టర్ ప్లాన్

కేరళలో ఓటు బ్యాంకు పెంచుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. శాసన సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. వీలైనంత త్వరగా కేరళ నటులను బీజేపీలో చేర్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రధాని మోడీతో సూపర్ స్టార్ భేటీ

ప్రధాని మోడీతో సూపర్ స్టార్ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్చ భారత్, స్వచ్చతా హి పథకాలను మెచ్చుకున్న హీరో మోహన్ లాల్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ కేరళకు భేటీ అయిన సమయంలో హీరో మోహన్ లాల్ ను కలిశారు. కేరళలో మోహన్ లాల్ కు చెందిన ఎన్ జీఓ సంస్థ చరుకుగా పని చేస్తోంది. తన ఎన్ జీఓ సంస్థ చేస్తున్న కార్యకలాపాల గురించి వివరించడానికి ప్రధాని నరేంద్ర మోడీతో హీరో మోహన్ లాల్ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది.

మోహన్ లాల్ వివరణ

మోహన్ లాల్ వివరణ

2019 లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని సూపర్ స్టార్ మోహన్ లాల్ వివరణ ఇచ్చారు. నటుడిగా తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, తన వృత్తిని ఇలాగే కొనసాగిస్తానని అన్నారు. తాను రాజకీయాల్లోకి రానని హీరో మోహన్ లాల్ అంటున్నారు. నటుడిగా తనకు ఎక్కువ స్వాతంత్రం ఉందని, ఎంతో మంది రాజకీయ నాయకులు తనకు టచ్ లో ఉంటున్నారని హీరో మోహన్ లాల్ తెలిపారు.

English summary
Speculations of Malayalam superstar Mohanlal joining politics have been put to rest, after he clarified that he had no intention to contest elections or join politics. Politics is not my cup of tea. I want to remain an actor always. I enjoy the freedom I have in this profession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X