• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏ-యూపీఏ?: నితీష్ కుమార్‌కు ఫోన్ చేసిన అమిత్ షా, రేపు ఏం జరుగుతుందో?

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. బీహార్‌లోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) ప్రభుత్వంలో చీలికలు పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో.. ముఖ్యమంత్రి, జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) నాయకుడు నితీష్ కుమార్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి కాల్ వచ్చినట్లు సమాచారం.

ఈ ఇద్దరు నేతలు కాల్‌లో కొంతసేపు మాట్లాడుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని రిపబ్లిక్ టీవీ కథనం వెల్లడించింది. ఎన్డీఏలోనే కొనసాగాలని నితీష్ కుమార్ ను అమిత్ షా కోరినట్లు తెలుస్తోంది. కాగా, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వేచి చూసే రీతిలో ఉండగా.. జేడీయూ మంగళవారం ఉదయం 11 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశానికి పిలుపునిచ్చింది. అమిత్ షా ఫోన్ నేపథ్యంలో రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

అలాగే, ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) తమ తమ ఎమ్మెల్యేలను అదే రోజు చర్చకు పిలిచాయి. బీజేపీ నుంచి జేడీయూ విడిపోయి కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 Speculations Of BJP-JDU Split: Amit Shah Dials Nitish Kumar: Both Hold Long Discussion

ప్రస్తుతం ఆర్జేడీకి 77 సీట్లు, కాంగ్రెస్‌కు 19 సీట్లు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అండ్ లెనిన్ (సీపీఐఎం), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐకి 16 సీట్లు, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న మహాకూటమికి 115 సీట్లు వచ్చాయి. అధికార ఎన్డీఏ కూటమికి 127 సీట్లు ఉన్నాయి, ఇందులో BJPకి 77 సీట్లు, జేడీయూకి 45, హిందుస్థానీ అవామ్ మోర్చా-సెక్యులర్ [HAM(S)] 4, లోక్ జనశక్తి పార్టీ (LJP)కి 1 సీట్లు ఉన్నాయి.

జేడీయూ-బీజేపీ సంబంధాలు దెబ్బతిన్నాయి

గత కొంతకాలంగా బీహార్‌లో బీజేపీ తన సత్తా చాటుతోంది. అయోధ్య, ఆర్టికల్ 370, యూనిఫాం సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్, ఎన్‌ఆర్‌సి, జనాభా నియంత్రణకు చట్టబద్ధమైన చర్యలు వంటి అంశాల విషయంలో బీజేపీ, జేడీయూలకు కొంత బేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి.

Recommended Video

ఆజాదీ సాయంతో మోడీ జమిలి ప్లాన్ *National | Telugu OneIndia

అయితే సీఎం నితీష్ కుమార్ అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై సమీక్ష కోరడంతో పాటు నిరసనకారుల భయాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో తాజాగా మళ్లీ దూరం వచ్చింది. రాష్ట్రంలోని అనేక మంది బీజేపీ నేతల ఇళ్లను ధ్వంసం చేయడంతో.. బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ సంజయ్ జైస్వాల్ 'తగిన చర్యలకు' ఎన్డీఏ ప్రభుత్వాన్ని బాధ్యులను చేశారు. జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని నితీష్ కుమార్ అనుమానిస్తుండటం కూడా ఓ కారణంగా తెలుస్తోంది.

English summary
Speculations Of BJP-JDU Split: Amit Shah Dials Nitish Kumar: Both Hold Long Discussion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X