వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ జేమ్స్‌బాండ్: అజిత్ దోవల్‌కి శక్తివంతమైన కీలక పదవి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియన్ జేమ్స్‌బాండ్‌గా పేరు తెచ్చుకున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు మరో శక్తివంతమైన కీలక పదవిని అప్పగించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్(ఎస్పీజీ) బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది. ఇప్పటి వరకూ ఈ బాధ్యతలను కేబినెట్ సెక్రటరీ పర్యవేక్షిస్తుండగా.. ధోవల్‌కు బదలాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

శక్తివంతమైన బ్యూరోక్రాట్

శక్తివంతమైన బ్యూరోక్రాట్

కాగా, 1998 నుంచి దేశంలోకెల్లా శక్తివంతమైన బ్యూరోక్రాట్‌గా ధోవల్ నిలవనున్నారు. ఐబీ, రా తదితర విభాగాల మధ్య మరింత సమన్వయం పెంపొందించడానికే ధోవల్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.

అజిత్ నియామకం

అజిత్ నియామకం

1999లో కేబినెట్ సెక్రటరీ చైర్‌పర్సన్‌గా ఎస్‌పీజీని ఏర్పాటు చేశారు. సోమవారమే (అక్టోబర్ 8న) ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌ను చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1999 నోటిఫికేషన్ ప్రకారం ఎస్‌పీజీలో 16 మంది సభ్యులుండగా.. నీతి ఆయోగ్ వైస్‌ చైర్మన్‌‌కి కూడా స్థానం కల్పించి 18కి పెంచారు.

మరింత ప్రాధాన్యత, బాధ్యత

మరింత ప్రాధాన్యత, బాధ్యత

శాఖల మధ్య సమన్వయం, సమాచారం అందుకోవడం, జాతీయ భద్రతకు సంబంధించిన విధానాల రూపకల్పన తదితర వ్యవహారాలను స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ (ఎస్‌పీజీ)ను పర్యవేక్షిస్తుంది. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇది సహ త్రివిధ దళాల అధిపతులు, ఆర్‌బీఐ గవర్నర్; విదేశీ వ్యవహారాలు, హోం, రక్షణ, ఆర్థిక, రెవెన్యూ, అటామిక్ ఎనర్జీ, స్పేస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్‌ల కార్యదర్శులు, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, కేబినెట్ సెక్రటేరియట్‌లోని సెక్రటరీ, ఐబీ చీఫ్ తదితరులు ఎస్‌పీజీలో సభ్యులుగా ఉంటారు. కీలక పదవితో అజిత్ దోవల్ ప్రాధాన్యత, బాధ్యత ఇప్పుడు మరింత పెరిగినట్లయింది.

హెన్రీ కిస్సింజర్, జేమ్స్‌ బాండ్‌ 007ను కలిపితే అజిత్ దోవల్

హెన్రీ కిస్సింజర్, జేమ్స్‌ బాండ్‌ 007ను కలిపితే అజిత్ దోవల్

కాగా, ‘హెన్రీ కిస్సింజర్, జేమ్స్‌ బాండ్‌ 007ను కలిపితే జాతీయ భద్రతా సలహాదారు' అజిత్‌ దోవల్‌ అవుతారు' అని ఆయన గురించి ‘కారవాన్‌ మాగజైన్‌' గొప్పగా రాయడం గమనార్హం. దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమస్యలను కూడా అత్యంత సూక్ష్మ దష్టితో ఆయన పరిష్కరిస్తున్నారని ఆయన్ని కొనియాడింది. ‘మోడీని దోవ్‌ ఎలా రక్షించారంటే' అనే శీర్షిక పెట్టి మరీ ప్రశంసించింది.

English summary
A rejig of the key Strategic Policy Group (SPG) gives National Security Advisor (NSA) Ajit Doval an unprecedented role in the process of planning India’s security strategy, and the Prime Minister’s Office an absolute handle on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X