వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుల్లో కూరుకుపోయిన స్పైస్ జెట్: కింగ్ ఫిషర్ బాటలోనే..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్పైస్ జెట్ విమానయాన సంస్ధ త్వరలో కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిర్వహణ సమస్యల కారణంగా నిండా అప్పుల్లో కూరుకుపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లాగే, దాని బాటలోనే స్పైస్ జెట్ పయనిస్తోంది.

ప్రస్తుతం రూ.2 వేల కోట్లకు పైగా అప్పులతో స్పైస్ జెట్ సతమతమవుతోంది. మొత్తం 48 విమానాలు కలిగిన స్పైస్ జెట్ ప్రస్తుతం రోజుకు 239 సర్వీసులను నడుపుతోంది. నిర్వహణ లోపం నేపథ్యంలో సెప్టెంబర్ లో రోజుకు 332 సర్వీసులను తిప్పిన స్పైస్ జెట్, కేవలం రెండు నెలల వ్యవధిలోనే వందకు మేర సర్వీసులను రద్దు చేసింది.

SpiceJet has a history of fight for survival

అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థిస్తోన్న స్పైస్ జెట్ యాజమాన్యం, లేనిపక్షంలో రోజువారీ కార్యకలాపాలను కూడా నిర్వహించలేమని వాపోతోంది. అయితే స్పైస్ జెట్ కు సంబంధించి ఆర్థికంగా ఆదుకోవడానికి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సి ఉంటుందని, సంస్థ విజ్ఞప్తిని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక, పెట్రోలియం శాఖల ముందుకు తీసుకువెళ్లనున్నట్టు స్పైస్‌జెట్‌ అధికారులకు చెప్పానని మహేష్‌ శర్మ విలేకరులకు తెలిపారు.

ఉద్యోగులకు బకాయి పడిన వేతనాల విడుదలతోపాటు వెండార్లకు చెల్లించాల్సిన 1,600 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు స్పైస్‌జెట్‌కు డిజిసిఎ గతంలో సోమవారం వరకు గడువిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులు డిజిసిఎలో వివరాలు అందజేశారు.

సెప్టెంబర్‌లో రోజువారీ విమాన సర్వీసుల సంఖ్య 332 ఉంటే తాజాగా వీటి సంఖ్య 239కి తగ్గిపోయింది. నెలకు 1,800లకు పైగా విమాన సర్వీసులను సంస్థ రద్దు చేసింది. సంస్థ చేతిలో 33 బోయింగ్‌ 737, 15 క్యు-400 ప్రాంతీయ జెట్లు ఉన్నాయి. వీటిలో 35 మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. దేశీయ విమానయానరంగంలో సంస్థ మార్కెట్‌ వాటా 17 శాతం ఉంది.

English summary
That was the airline's first crisis in what now turns to be an unending quest for promoters and investors. In 2000, UK-based NRI Bhulo Kansagra bought into the airline. "They got Modiluft's lapsed licence revived and brought in a plane to start a full service airline called Royal Airlines," said a person long associated with SpiceJet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X