వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాక్‌పిట్‌లో ఎయిర్‌హోస్టెస్‌తో పైలట్ లాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యాంగ్‌కాక్‌కు చెందిన విమానంలో పైలట్ ఎయిర్‌హోస్టెస్‌ను వేధించినందుకు పైలట్‌ను స్పైస్‌జెట్ సంస్థ తొలగించింది. ఎయిర్ హోస్టెస్‌ను కాక్‌పిట్‌లో ఉంచుకుని పైలట్ లాక్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తన సీటుపై కూర్చోవాలని ఆమెను అతను అడిగినట్లు తెలుస్తోంది.

పైలట్ చర్యను భద్రత నిబంధనలను, రక్షణ నిబంధనలను ఉల్లంఘించడమేనని సంస్థ భావించింది. కోల్‌కతా - బ్యాంగ్‌కాక్ మధ్య నడిచే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. తన చర్య ద్వారా ప్రయాణికుల భద్రతను పైలట్ గాలికి వదిలేసినట్లు సంస్థ అభియోగం మోపింది.

ఎయిర్ హోస్టెస్‌తో పైలట్ అసభ్యంగా మాట్లాడడంతో సంఘటన వెలుగు చూసింది. తిరుగు ప్రయాణంలో కూడా కాక్ పిట్‌లోనే ఉండాలని పైలట్ ఎయిర్ హోస్టెస్‌ను ఆదేశించినట్లు సమాచారం. వాష్‌రూంకు వెళ్లిన కో పైలట్‌ను చాలా సేపటి తర్వాత లోనికి అనుమతించినట్లు తెలుస్తోంది.

SpiceJet sacks pilot for locking himself in cockpit with an air hostess

సంబంధిత అధికారులకు ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేసింది. పౌరవిమాన యాన డైరెక్టర్ జనరల్ (డిజిసిఎ) దృష్టికి కూడా ఈ విషయాన్ని ఆమె తెచ్చింది. డిడిసిఎ చీఫ్ ఎం. సత్యవతి స్వయంగా సంఘటనపై విచారణ చేస్తున్నారు. పైలట్ దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అన్ని పక్షాలకు చెందిన వాంగ్మూలాలను రికార్డు చేశామని, ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారిని తొలగించామని, ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని స్పైస్‌జెట్ కార్పోరేట్ కమ్యూనికేషన్ జిఎం అజయ్ జస్రా చెప్పారు.

English summary
SpiceJet showed pink slip to a pilot for allegedly harassing an air hostess aboard a Bangkok bound flight. The pilot allegedly locked himself inside the cockpit along with the air hostess and asked her to sit on his seat without any rhyme or reason on both legs of the international flight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X