వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒళ్లు గగుర్పొడిచే వీడియో: పులి నోట్లో ఉన్న ఈ వ్యక్తి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

#MustWatch : Man Ecapes From Tiger will give you Goosebumps || Video Goes Viral || Oneindia Telugu

మహారాష్ట్ర: పులి అంటే భయపడని వారు ఎవరుండరు చెప్పండి. సర్కస్‌లలో శిక్షణ పొందిన పులులను చూస్తే కూడా భయపడతాం. అలాంటిది ఏకంగా పులే మన ఎదురుగా వచ్చి నిలబడితే అంతే అది చంపక్కర్లేదు. ఆ భయానికే గుండె ఆగిపోయే పరిస్థితి వస్తుంది. చిన్నప్పుడు ఓ కథ వినే ఉంటాం. ఓ ఇద్దరు స్నేహితులు అలా నడుచుకుంటూ వెళుతుంటే ఓ ఎలుగుబంటి ఎదురవుతుంది. అందులో ఒకడు ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టు ఎక్కుతాడు. మరొకడికి చెట్టు ఎక్కడం చేతకాక అలానే ఉండిపోతాడు. అంతేకాదు ఊపిరి తీసుకోకుండా చనిపోయినట్లు నటిస్తాడు. అక్కడికి వచ్చిన ఎలుగుబంటి ఆ వ్యక్తి కదలికలు లేకపోవడంతో అది వెళ్లిపోతుంది. ఇలాంటి పరిస్థితే మహారాష్ట్రలో జరిగింది. అయితే ఇక్కడ ఎలుగుబంటి కాదు.. ఓ పెద్ద పులి.

మనిషిని లాక్కెళ్లిన పులి

ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు. ఓ పులి ముందు అలా ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. పులి అతన్ని పట్టుకుని కొంతదూరం వరకు లాక్కెళ్లింది. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడని అంతా భావించారు. కనీసం మృతదేహమైనా దొరుకుతుందని భావించిన గ్రామస్తులు ఆ పులిపై రాళ్లు కర్రలు విసిరారు. దీంతో ఆ పులి ఈడ్చుకెళుతున్న మనిషిని వదిలేసి తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించి పరుగులు తీసింది. అయితే చివరిగా వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.. పులి తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ దృశ్యాలన్నీ కెమెరాలో ఎవరో బంధించగా దాన్ని ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంత వైరల్ అయ్యింది. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండంటూ పోస్టులో రాసుకొచ్చాడు.

చనిపోయినట్లుగా నటించిన వ్యక్తి

మొత్తం 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోకు చాలా కామెంట్స్ వచ్చాయి. భండారా జిల్లాలోని తుమ్సార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుదంటూ ఓ ట్విటర్ వినియోగదారుడు చెప్పాడు. ముందుగా పొలాల్లో ఈ పులి సంచరిస్తుండగా కొందరు గ్రామస్తులు చూసి దీన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. గ్రామస్తులను చూసి పులి పరుగులు తీస్తూ ఓ వ్యక్తిని పట్టుకుని లాక్కెళ్లింది. ఇక గ్రామస్తులు కర్రలు విసరడంతో ఆ వ్యక్తిని వదిలేసి తన ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసింది. అయితే ఇదంతా జరుగుతున్నంత సేపు ఆ వ్యక్తి చనిపోయినట్లుగానే నటించాడు. పులి నోటి నుంచి బయటపడే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు.

తప్పించుకునే ప్రయత్నం చేసి ఉంటే అంతే..

తప్పించుకునే ప్రయత్నం చేసి ఉంటే అంతే..

ఒకవేళ ఆ ప్రయత్నం చేసిఉంటే పులి ఆ వ్యక్తిపై పంజా విసిరి చంపేసి ఉండేది. ఇక్కడే ఆ వ్యక్తికి తట్టిన ఆలోచనపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు జంతు ప్రేమికులు పులికి ఏమీ కాలేదని అనుకుంటున్నామని పోస్టు చేయగా... మరికొందరు పులి, ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం సంతోషంగా ఉందంటూ కామెంట్స్ రాసుకొచ్చారు.

English summary
Spine-chilling video of man getting attacked by tiger and playing dead to save his life in Maharashtra has been going viral. Twitter has goosebumps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X