వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: మహిళా వైద్యులపై ఇంటిరియర్ డిజైనర్ దాడి, చెంపపై చెళ్లుమనిపించి, చేయి తిప్పి, అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌తో ప్రజల్లో కోపం, ఆవేశం పెరుగుతోంది. వైరస్ ఎవరినుంచి వస్తుందో తెలియకపోవడంతో.. తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీలో ఇద్దరు మెడికోలపై ఓ వ్యక్తి దాడి చేశాడు. కిరాణా సామాను కోసం వచ్చిన వారిపై దాడి చేయడం కలకలం రేపింది. వైద్యులపై దాడి చేసింది ఎవరో చెప్పేందుకు స్థానికులు నిరాకరించంతో.. పోలీసులు కనుక్కొన్నారు.

మహిళా వైద్యులపై దాడి

మహిళా వైద్యులపై దాడి

సఫ్తార్ గంజ్ ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు మహిళా వైద్యులు గౌతమ్ నగర్‌లో నివసిస్తున్నారు. అయితే సరుకుల కోసం వారిద్దరూ బుధవారం సాయంత్రం బయటకొచ్చారు. దీంతో అక్కడ ఓ ఇంటిరియర్ డిజైనర్ వారిని అడ్డుకొన్నారు. ఎందుకు బయటకొచ్చారని ప్రశ్నించారు. తర్వాత వారిపై దాడి చేశాడు. మొహం చేయిచేసుకొని, చేతులను మడిచాడు. అక్కడున్న స్థానికులు అడ్డుకోవడంతో పారిపోయాడు. తర్వాత వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అక్కడొచ్చిన.. దాడిచేసిన దుండగుడు మాత్రం అప్పటికే పారిపోయాడు.

స్థానికులు అడ్డుకొని..

స్థానికులు అడ్డుకొని..

దుండగుడు దాడి చేస్తు అడ్డుకొన్న స్థానికులు.. మహిళా వైద్యులపై చేయి చేసుకున్న వాడి వివరాలు మాత్రం పోలీసులకు తెలియజేయలేదు. తర్వాత వారు ఇంటిరియర్ డిజైనర్‌గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసినట్టు వివరించారు. ఇద్దరు మహిళా వైద్యులను సప్ధార్ గంజ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడవారికి ప్రాథమిక చికిత్స అందజేశారు.

 హాట్‌స్పాట్ సెంటర్లు

హాట్‌స్పాట్ సెంటర్లు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 669 కాగా.. 9 మంది చనిపోయారు. కరోనా వైరస్ హాట్ స్పాట్ సెంటర్లుగా 20 కేంద్రాలు అని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. సదార్ బజార్, బెంగాల్ మార్కెట్ సీజ్ చేశారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో ఢిల్లీలో ప్రజలు తప్పకుండా మాస్క్ వేసుకొని రావాలని ప్రభుత్వం స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.

Recommended Video

YS Jagan & KCR Have Different Opinion On Lockdown Lifting

English summary
Two women doctors of the government-run Safdarjung Hospital in south Delhi were assaulted on Wednesday evening when they were out buying groceries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X