వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం రేపిన రోడ్డుపై రూ. 500 నోట్లు: కరోనా వ్యాప్తి కోసమేనా? ఏం జరిగింది?

|
Google Oneindia TeluguNews

లక్నో: సాధారణంగా రోడ్డుపై రూ. 500 పడితే ఏం చేస్తారు. అటూ ఇటూ చూసి జేబులో వేసుకుంటారు. లేదంటే ఆ డబ్బు ఎవరిదోనని ఆరా తీసి వారికి చెందేలా చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. రోడ్డుపై రూ. 500 నోట్లు పడివున్నప్పటికీ ఎవరూ ముట్టుకోకపోవడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

రూ. 500 నోట్లను చూసి భయపడిపోయారు..

రూ. 500 నోట్లను చూసి భయపడిపోయారు..

వివరాల్లోకి వెళితే.. లక్నోలోని పేపర్ మిల్ కాలనీలోని రహదారిపై గురువారం రాత్రి రెండు రూ. 500 నోట్లు కనిపించాయి. అయితే, అటువైపు వెళ్లేవారు మాత్రం ఆ డబ్బులను ముట్టుకునేందుకు కూడా భయపడిపోయారు. వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు.

అటు పోలీసులకు.. ఇటు వైద్యులకు సమాచారం..

అటు పోలీసులకు.. ఇటు వైద్యులకు సమాచారం..

అంతేగాక, కరోనావైరస్ వ్యాప్తి చేయడానికే ఎవరో వాటిని ఇక్కడ పడేశారన్న అనుమానంతో ఆ నోట్ల వైపు వెళ్లలేదు. ఇంకేవరినీ కూడా అటువైపు వెళ్లనీయలేదు. అంతటితో ఆగకుండా పోలీసు హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి ఈ నోట్లకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. స్థానికంగా ఉన్న డాక్టర్లను కూడా సంప్రదించారు. దీంతో సదరు వైద్యులు 24 గంటలపాటు ఆ నోట్లను ముట్టుకోకూడదని సూచించారు. ఇక స్థానిక ప్రజలు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.

సోషల్ మీడియాలో వీడియోనే కారణం కావొచ్చు...

సోషల్ మీడియాలో వీడియోనే కారణం కావొచ్చు...

ఈ విషయంపై మీడియా ప్రతినిధులు స్థానిక ప్రజలను ప్రశ్నించగా.. కరోనావైరస్ వ్యాప్తి చేయడం కోసమే ఎవరో ఆ నోట్లను ఇక్కడ పడేశారని చెప్పుకొచ్చారు. కరెన్సీ నోట్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే ప్రజలు ఆందోళన చెందుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

Recommended Video

Lockdown : Trains Likely To Available From 15th April
మహారాష్ట్రలో ఓ వ్యక్తి అరెస్టు..

మహారాష్ట్రలో ఓ వ్యక్తి అరెస్టు..


మహారాష్ట్రలో ఓ వ్యక్తి కరెన్సీ నోట్లకు ముక్కులోని శ్లేష్మం అంటిస్తూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. సదరు వ్యక్తి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలాంటి చర్యలు సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

English summary
In these pandemic times, it took two Rs 500 currency notes to create mayhem in Lucknow's Paper Mill colony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X