చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రియ తెల్సని టెక్కీ మోసం: పోలీసులతో గర్ల్ గుణపాఠం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Spunky woman team up with cops teach techie lesson
బెంగళూరు: తనకు కమల్ హాసన్, శ్రియా వంటి సిని ప్రముఖులు తెలుసునని, సినిమా చాన్సులు ఇప్పిస్తానని ఓ యువతిని నమ్మించి, మోసం చేసిన టెక్కీని కర్నాటక రాజధాని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని గోకుల్ నాథ్ గుర్తించారు. ఇతను చెన్నై టిసిఎస్‌లో పని చేస్తున్నాడు. అతనికి పెళ్లయింది.

ఐటి ఇంజనీర్ అయిన గోకుల్ నాథ్.. మొదట సంగీతా మోహన్ పేరిట ఓ ఫేక్ ఫేస్ బుక్ క్రియేట్ చేశాడు. ఇంటీరియర్ డిజైనర్ అయిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. తనను తాను ఓ సక్సెస్ ఫుల్ మోడల్‌గా, డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా తనకు కమల్ హాసన్, శ్రియా శరణ్ వంటి వారితో పరిచయాలు ఉన్నట్లు చెప్పాడు.

నవంబర్ 2013 నుండి గోకుల్ నాథ్ క్రియేట్ చేసిన సంగీతా మోహన్ ఫేస్ బుక్ నుండి పోస్ట్‌లు రావడం ప్రారంభమయ్యాయి. సినీ పరిశ్రమలోకి రావాలని సూచించాడని ఆ యువతి పేర్కొంది. మొదట ఆమె సంగీత మోహన్ నుండి వచ్చిన పోస్టులు తొలగించింది.

కానీ, అదే పనిగా పోస్టులు వచ్చాయి. సినిమాల్లోకి రావాలని పదే పదే అడిగిన అతను ఆమెను ఎట్టకేలకు కొంత మొగ్గేలా చేశాడు. చెన్నైలో ఫోటో షూట్ కోసం రావాలని సూచించాడు. నిర్మాతలతో ఓసారి కలిస్తే సినిమాలలో అవకాశాలు చాలా సులభమని ఊరించాడు.

అనంతరం మరో వ్యక్తి తెర పైకి వచ్చాడు. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకొని ఆ యువతిని ఫోటోస్ పంపించమన్నాడు. ఈ క్రమంలో అతను బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరులోని ఓ హోటల్లో రూం బుక్ చేశారు. వెస్టెర్న్ అండ్ ట్రెడిషనల్ దుస్తులతో రమ్మని యువతికి సూచించాడు.

పోలీసులకు ముందే ఈ విషయాన్ని ఆమె చెప్పింది. పోలీసులు హోటల్ రూం ముందు ఉన్నారు. రూంలోకి వెళ్లిన యువతిని అతను కొన్ని ఫోటోస్ తీసుకున్నడు. వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ దుస్తుల్లో ఫోటోలు తీసుకున్నాడు. ఆ సమయంలో అతను ఆమెకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశాడు. ఆమె దుస్తులు తొలగించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె పోలీసులను పిలిచింది.

పోలీసులు లోపలకు వచ్చి అతనిని అరెస్టు చేశారు. కెమెరా, లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో తెర పైకి వచ్చిన కొత్త వ్యక్తే గోకుల్ నాథ్ అని గుర్తించారు. అతను చెన్నైలో పని చేస్తున్నట్లుగా తెలుసుకున్నారు. అతను మరో నలుగురు అమ్మాయిలతో ఇలాగే ఆడుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్టు చేశారు.

English summary
Bangalore police arrested Gokulnath Parthipan, an engineer of TCS in Chennai for trying to cheat a woman in the name of getting her a chance to act in movies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X