వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిషేధం: బౌలర్ శ్రీశాంత్ వివాదాల చిట్టా బారెడు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పేస్ బౌలర్ శ్రీశాంత్ తన క్రికెట్ జీవితం ప్రారంభం నుంచి వివాదాలతో ముడిపడి ఉందని చెప్పవచ్చు. శ్రీశాంత్ ప్రవర్తనను గమనించి ఓ సందర్భంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రమాదం కోసం ఎదురుచూస్తున్నాడని శ్రీశాంత్‌పై చాపెల్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలను నిజం చేస్తున్నట్లుగా స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధాలున్నట్లు నిర్ధారించిన బీసీసీఐ శ్రీశాంత్‌పై నిషేధం విధించడం గమనార్హం.

2005-06 ఛాలెంజర్ ట్రోఫీలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేశాడు. బంతి బ్యాట్‌కు తగలకుండా పోవడంతో సచిన్ వైపు తదేకంగా చూస్తూ కొంత గర్వం ప్రదర్శించాడు. అయితే తన తర్వాతి బంతిని సిక్స్ బాదడం ద్వారా సచిన్ శ్రీశాంత్‌కు సమాధానం చెప్పాడు.

Sreesanth

శ్రీశాంత్ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను తన వెక్కిలి చేష్టలతో ఆట పట్టించేవాడు. బౌలింగ్‌తోనే కాకుండా తన చేష్టలతోనే శ్రీశాంత్ ఎక్కువ ప్రచారం పొందాడని చెప్పవచ్చు. ఏదేమైనా శ్రీశాంత్ ఒక నైపుణ్యం కలిగిన బౌలర్‌. ఎమ్మార్ఎఫ్ పేస్ ఫౌండేషన్, తన గురువు టిఎ శేఖర్‌ల సహకారంతో శ్రీశాంత్ మంచి బౌలర్‌గా పేరుతెచ్చుకున్నారు. శ్రీశాంత్‌లా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదని బౌలర్ జహీర్ ఖాన్ అన్నారు. దక్షణాఫ్రికా పర్యటనలో జోహన్నస్ బర్గ్ టెస్ట్‌లో 5/40తో రాణించిన శ్రీశాంత్ భారత్ కు విజయాన్నిందించాడు.

విదేశీ ఆటగాళ్లతోపాటు స్వదేశీ ఆటగాళ్లతోనూ వివాదాలకు దారితీశాయి శ్రీశాంత్ చేష్టలు. మైకేల్ వాన్, అండ్రూ సైమండ్స్, కెవిన్ పీటర్సన్, అండ్రూ నల్ లతో శ్రీశాంత్ వివాదాలు పెట్టుకున్నాడు. అలాగే స్వదేశీ ఆటగాడు హర్భజన్ సింగ్‌తోనూ వివాదం పెట్టుకుని చెంప దెబ్బతిన్నాడు. వీటితోపాటు 2007లో జరిగిన ట్వంటీ20, 2011 ప్రపంచ కప్‌లు సాధించిన భారత జట్టులోనూ శ్రీశాంత్ భాగస్వామి కావడం గమనార్హం.

విచిత్రమేమిటంటే 2011, ఏప్రిల్ 2న జరిగిన ప్రపంచ వన్డే మ్యాచే అతనికి చివరి మ్యాచ్ అయింది. కేరళ నుంచి జాతీయ జట్టుకు ఎంపికైన నైపుణ్యం గల ఆటగాడు చెడ్డదారిలో పోవడం ద్వారా తన క్రికెట్ జీవితాన్ని కోల్పోయాడని శ్రీశాంత్‌ను ఉద్దేశించి మాజీ భారత జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు.

2005 నుంచి 2013 వరకు శ్రీశాంత్ వివాదాలు

2005
మొహాలీలో జరిగిన ఛాలెంజర్ ట్రోఫీలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు తన వెకిలి చేష్టలతో కోపం తెప్పించాడు. తన బౌలింగ్‌లో సచిన్ వికెట్ తీసుకుని వెకిలి చేష్టలతో తన ఆనందాన్ని ప్రదర్శించాడు.

2006
సౌతాఫ్రికా పేస్ బౌలర్ అండ్రూ నల్ బౌలింగ్‌లో సిక్స్ బాది గ్రౌండ్‌లో బ్యాట్‌తో డ్యాన్స్ చేసుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. హషీమ్ అమ్లా వ్యవహారంలో 20శాతం మ్యాచ్ ఫీ, ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించారని 10 మ్యాచ్ ఫీ కోత పెట్టుకున్నాడు.

2007
ఇంగ్లండ్ కెప్టెన్ మైకేల్ వాన్‌ను భుజంతో ఢీకొట్టడం ద్వారా మ్యాచ్ ఫీజులో 50శాతం కోత పెట్టుకున్నాడు. కెవిన్ పీటర్సన్ వ్యవహారంలోనూ వివాదస్పదమయ్యాడు. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియ ఆటగాడు అండ్రూ సైమండ్స్‌తో వాగ్వాదానికి దిగాడు.

2008
ఏప్రిల్ మొహాలీలో పంజాబ్ జట్టుతో ముంబై తలపడిన మ్యాచ్‌లో హర్భజన్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ వివాదంలో హర్భజన్..శ్రీశాంత్‌కు చెంప దెబ్బ తగిలించడంతో ఏడ్చుకుంటూ కెమెరాలకు చిక్కాడు. దీంతో హర్భజన్‌ను ఐపీఎల్ ఎడిషన్ నుంచి తప్పించడం జరిగింది. బెంగళూరులోని తన అపార్ట్ మెంట్‌లో అర్ధరాత్రి పార్టీ చేసుకోవడంతో స్థానికులు శ్రీశాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2009
ఇరానీ కప్ సమయంలో నియమ నిబంధనలు పాటించని కారణంగా బీసీసీఐ శ్రీశాంత్‌కు వార్నింగ్ ఇచ్చింది. ప్రవర్తన ఇలాగే కొనసాగిస్తే దేశీయ మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. కేరళ జట్టు కెప్టెన్'గా ఉన్న సమయంలో రంజీ ట్రోఫీలో పాల్గొనకపోవడంతో కేరళ క్రికెట్ అసోసియేషన్ హెచ్చరికలు జారీ చేసింది.

2010
అంపైర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యంగ్యంగా సమర్థిస్తూ చప్పట్లు కొట్టడంతో మ్యాచ్ ఫీలో 20శాతం కోల్పోయాడు.

2011
సౌతాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో బౌండరీలో ఉన్న రోప్‌ను తన్నడం ద్వారా 10శాతం మ్యాచ్ ఫీ కోల్పోయాడు.

2012
జూన్‌లో బెంగళూరు నుంచి ఢిల్లీ వెళుతుండగా విమానంలో సహ ప్రయాణికుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ప్రయాణికుల ఫిర్యాదు.

2013
ఫిబ్రవరిలో జరిగిన సౌత్ జోన్ టోర్నమెంట్‌లో దినేష్ కార్తీక్‌తో వాగ్వాదం చేయడం ద్వారా రెండు మ్యాచ్‌ల నుంచి బీసీసీఐచే బహిష్కరించబడ్డాడు.

మే: ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధాలున్న కారణంగా ఢిల్లీ పోలీసులచే అరెస్ట్ చేయబడ్డాడు. శ్రీశాంత్ తోపాటు అంకిత్ చవాన్, అజిత్ చండిలలు కూడా అరెస్టయ్యారు.

సెప్టెంబర్ 13: స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధాలున్నాయని నిర్ధారించిన బీసీసీఐ శ్రీశాంత్ పై జీవిత కాలం నిషేధం విధించింది. ఈ విధంగా శ్రీశాంత్ క్రికెట్ జీవితం వివాదాలతో మొదలై వివాదాలతోనే ముగిసిందని చెప్పవచ్చు.

English summary
Former Australia captain Ian Chappell once famously said of S Sreesanth as an "accident waiting to happen". Those words came true on Friday the 13th when the paceman's cricket career ended by spot-fixing accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X