
సంతోషాన్ని ఇవ్వకపోయినా..: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా పేసర్ శ్రీశాంత్
తిరువనంతపురం: టీమిండియా పేసర్ శ్రీశాంత్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన కేసులో దోషిగా తేలడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ ఏడేళ్ల నిషేధం విధించింది.
Today is a difficult day for me, but it is also a day of reflection and gratitude. Playing for Ecc, Ernakulam district,varies diff. League and tournament teams, Kerala state cricket association,Bcci, Warwickshire county cricket team,Indian airlines cricket team,Bpcl , and ICC
— Sreesanth (@sreesanth36) March 9, 2022
2020 సెప్టెంబర్ నాటికి ఏడేళ్లు పూర్తయిన తర్వాత కూడా శ్రీశాంత్ కు భారత జట్టు తరపున ఆడే అవకాశం రాలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే శ్రీశాంత్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని.. ఇది తనకు సంతోషాన్ని ఇవ్వకపోయినా.. రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని భావించినట్లు తెలిపాడు.ఈ మేరకు శ్రీశాంత్ ట్విట్టర్ ద్వారా తన రిటైర్మెంట్ని ప్రకటించాడు.ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన అభిమానులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. బరువెక్కిన హృదయంతో ఈ మాటలు చెబుతున్నానని.. అయితే రిటైర్మెంట్ పట్ల తానేమీ విచారించట్లేదని వ్యాఖ్యానించాడు.
— Sreesanth (@sreesanth36) March 9, 2022
'నాకు మద్దతుగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పుడు నాకు మద్దతుగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఇక ముందు యువ క్రికెటర్ల కోసం కోచింగ్ సెటప్‌లో భాగం కావాలనుకుంటున్నాను. వీలైతే బీసీసీఐ అనుమతినిచ్చాక ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్స్‌లో ఆడాలనుకుంటున్నా.' అని శ్రీశాంత్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడించాడు.
For the next generation of cricketers..I have chosen to end my first class cricket career. This decision is mine alone, and although I know this will not bring me happiness, it is the right and honorable action to take at this time in my life. I ve cherished every moment .❤️🏏🇮🇳
— Sreesanth (@sreesanth36) March 9, 2022
కాగా, భారత జట్టు తరపున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు పడగొట్టాడు. అలాగే, 10 టీ20 మ్యాచుల్లో 7 వికెట్లు, 40 ఐపీఎల్ మ్యాచ్ లలో 44 వికెట్లు తీశాడు.