వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు, ముస్లీం ఓటర్లపై కాల్పులు, రాళ్లతో దాడి, నిప్పు, ఆందోళన !

|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు శనివారం జరుగుతున్నాయి. శనివారం ముస్లీం ఓటర్లను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య తీసుకు వెలుతున్న బస్సుల మీద గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపి రాళ్ల వర్షం కురిపించారు. బస్సులను అడ్డుకోవడానికి రోడ్ల మీద టైర్లకు నిప్పంటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ముస్లీం ఓటర్లు వెలుతున్న బస్సులను అడ్డుకోవడానికి రోడ్ల మీద టైర్లు వేసి నిప్పంటించారు. శ్రీలంక నార్త్ వెస్ట్ ప్రాంతంలో ముస్లీం ఓటర్లు వెలుతున్న బస్సుల మీద ముసుగులు వేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో కలకలం రేపింది.

Sri Lanka presidential elections: gunmen fires on buses carrying muslim voters in Sri Lanka

అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!

విషయం గుర్తించిన పోలీసులు అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించి ముస్లీం ఓటర్లను సురక్షితంగా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అయితే గుర్తు తెలియన వ్యక్తులు బస్సుల మీద కాల్పులు జరపడతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని, పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు.

శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఆదేశంలోని 1.59 కోట్ల మంది ఓటర్లు ఎన్నుకోనున్నారు. శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ పార్టీ తరపున మాజీ డిఫెన్స్ సెక్రటరీ గొటబాయా రాజపక్స (70), అధికార పార్టీ అభ్యర్థి సాజిత్ ప్రేమదాస (52), నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ అభ్యర్థి అనుర కుమారా దిస్సనాయకేల మధ్య అధ్యక్షపదవిలో ప్రధాన పోటీ ఉంది.

తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 35 మంది పోటీ చేస్తున్నారు. అయితే 2015లో జరిగిన ఎన్నికల్లో శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన మైత్రిపాల సిరిసేన ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదు. అధికార పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ అభ్యర్థి ప్రేమదాసకు ప్రజల్లో మంచి పేరు ఉంది.

సామాన్య మనిషిగా ప్రేమదాసకు ప్రజల్లో మంచి పట్టు ఉంది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస కుమారుడు ప్రేమదాసకు ప్రజలు ఎక్కువ మద్దతు ఇస్తున్నారని తెలిసింది. 1993లో ఎల్ టీటీ తీవ్రవాదులు రణసింఘే ప్రేమదాసను హత్య చేశారు. రణసింఘే ప్రేమదాస కుమారుడిగా ప్రేమదాసకు మంచి గుర్తింపు ఉంది. ఈ నెల 18వ తేదీ సోమవారం శ్రీలంక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.

English summary
Sri Lanka presidential elections are taking place on Saturday. Gunmen fired on buses carrying Muslim voters in northwest area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X