వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళుల ఆందోళన: శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే బుధవారం వేకువజామున దర్శించుకున్నారు. శ్రీవారి సుబ్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు వైకుంఠం క్యూకాంప్లెక్స్ మార్గం ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న రాజపక్సేకు మహాద్వారం వద్ద జెఈఓ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు.

స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్న రాజపక్సేకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని రాజపక్సేకు అందజేశారు.

శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల రాజపక్సే మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాల వారు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల వారు తనకు సోదరుల లాంటివారని చెప్పారు. ఆ తర్వాత ఆయన స్వదేశానికి బయల్దేరారు.

రాజపక్సే

రాజపక్సే

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే బుధవారం వేకువజామున దర్శించుకున్నారు.

రాజపక్సే

రాజపక్సే

శ్రీవారి సుబ్రభాత సేవలో పాల్గొన్న మహిందా రాజపక్సే స్వామివారిని దర్శించుకున్నారు.

రాజపక్సే

రాజపక్సే

అంతకుముందు వైకుంఠం క్యూకాంప్లెక్స్ మార్గం ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న రాజపక్సేకు మహాద్వారం వద్ద జెఈఓ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు.

రాజపక్సే

రాజపక్సే

స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్న రాజపక్సేకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని రాజపక్సేకు అందజేశారు.

రాజపక్సే

రాజపక్సే

శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల రాజపక్సే మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాల వారు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

రాజపక్సే

రాజపక్సే

అన్ని ప్రాంతాల వారు తనకు సోదరుల లాంటివారని చెప్పారు. ఆ తర్వాత ఆయన స్వదేశానికి బయల్దేరారు.

రాజపక్సే

రాజపక్సే

స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్న రాజపక్సేకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని రాజపక్సేకు అందజేశారు.

రాజపక్సేకు వ్యతిరేకంగా తమిళుల ఆందోళనలు

రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమలకు విచ్చేసిన రాజపక్సేకు తమిళుల నుంచి అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న రాజపక్సే మంగళవారం తిరుమలకు చేరుకునే సమయంలో తమిళనాడు నుంచి తిరుపతి చేరుకున్న రాజకీయ పక్షాలు రాజపక్సేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. రాజపక్సే వెళ్లిపోవాలంటూ రోడ్లపై నినాదాలు చేశారు.

కాగా, ఆందోళన చేపట్టిన వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజపక్సే బుధవారం వేకువజామున స్వామివారిని దర్శించుకున్న తర్వాత వెలుపలికి వస్తున్న సమయంలో వైగో మద్దతుదారులు జెండాలతో ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్వల్ప లాఠీఛార్జీ కూడా చేశారు. ఆందోళనకారులను పోలీసు వాహనంలో ఎక్కించి పాపవినాశనంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

English summary
Sri Lankan President Mahinda Rajapaksa on Wednesday morning offered prayers at the famous Tirumala temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X