వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి మృతి: గంటకో మలుపు, భౌతికకాయం అప్పగింతపై కొనసాగుతున్న సస్పెన్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ప్రముఖ నటి శ్రీదేవి మృతి కేసు గంటకో మలుపు తిరుగుతోంది. ఫోరన్సిక్, పోస్ట్ మార్టం నివేదిక అందిన తర్వాత కేసు దర్యాప్తు మలుపులు తిరుగుతోంది. దీంతో పోలీసులు ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు. అయితే ఇవాళ శ్రీదేవి బౌతికకాయం అప్పగించే విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

రెండు రోజుల క్రితం దుబాయ్‌లో ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణించారు. అయితే ఆమె తొలుత గుండెపోటుతో మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.

అయితే పోరెన్సిక్ నివేదిక తర్వాత బాత్‌టబ్‌లో శ్రీదేవి మునగడం వల్లే ఆమె చనిపోయిందని నిపుణులు ప్రకటించారు. అయితే ఆమె మరణంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు బదిలీ చేశారు.

శ్రీదేవి మృతదేహం అప్పగించే విషయమై సస్పెన్స్

శ్రీదేవి మృతదేహం అప్పగించే విషయమై సస్పెన్స్

సినీ నటి మృతదేహన్ని మంగళవారం నాడు అప్పగించే విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. శ్రీదేవి మరణంపై దుబాయ్ పోలీసులు కొంత అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతృప్తి వ్యక్తం చేస్తేనే మృతదేహం అప్పగించే అవకాశం ఉంది. బోనికపూర్‌ను ఇప్పటికే పోలీసులు విచారించారు.

చివరిక్షణాల్లో శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనికపూర్, దుబాయ్‌‌లో అంతేచివరిక్షణాల్లో శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనికపూర్, దుబాయ్‌‌లో అంతే

శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్‌పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అసంతృప్తి

శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్‌పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అసంతృప్తి

దుబాయ్‌ హోటల్‌ రూమ్‌లోని బాత్‌టబ్‌లో శ్రీదేవి మునిగి చనిపోయిందని ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. అయితే ఆమెను బాత్‌టబ్‌లో ఉన్న సమయంలో ఎవరూ చూశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.శ్రీదేవి ఫోన్ నుండి పదే పదే ఒకే నెంబర్ కు పోన్లు వెళ్ళడంపై కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ తతంగంపై విచారణ సాగుతోంది. మరో వైపు దుబాయ్ నుండి ఇండియాకు వచ్చిన బోనికపూర్ మళ్ళీ దుబాయ్‌ ఎందుకు వెళ్ళాడనే విషయాలపై కూడ పోలీసులు ప్రశ్నించారని సమాచారం. బోనికపూర్‌ను శ్రీదేవి గురించి పలు విషయాలను ఆరా తీశారని సమాచారం. అయితే బోనికపూర్ తీరుపై అనుమానాలతో ఆయన పాస్ట్‌పోర్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

శ్రీదేవి బౌతిక కాయం తరలింపుకు ఆలస్యం, ఎందుకంటే? శ్రీదేవి బౌతిక కాయం తరలింపుకు ఆలస్యం, ఎందుకంటే?

శ్రీదేవి ఆల్కహలు తీసుకొందా

శ్రీదేవి ఆల్కహలు తీసుకొందా

శ్రీదేవి మృతి తర్వాత ఆమె పార్తీ దేహన్ని పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులకు ఆమె రక్తంలో ఆల్కహలు నమూనాలను గుర్తించారు. అయితే మాజీ ఎంపీ అమర్ సింగ్ ఈ విషయంలో ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. శ్రీదేవికి మద్యం తాగే అలవాటు లేదన్నారు. ఎప్పుడైనా ఒక్కసారి కేవలం వైన్ తీసుకొనేదని చెప్పారు.అయితే ఆమె శరీరంలోకి ఆల్కహలు ఎలా వచ్చిందనేది ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.

కాల్‌డేటాను పరిశీలిస్తున్న అదికారులు

కాల్‌డేటాను పరిశీలిస్తున్న అదికారులు

శ్రీదేవి, బోనికపూర్‌ల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే హోటల్ రూమ్‌లోని బాత్ టబ్‌లో శ్రీదేవి మునిగి చనిపోయిందని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చింది.అయితే ఆ సమయంలో ఆమె బాత్‌టబ్‌లో మునిగి చనిపోయే సమయంలో అరవలేదా, అరిస్తే ఎవరూ కూడ ఆమెను కాపాడేందుకు రాలేదా, లేదా ఆమెను ఎవరైనా బాత్‌టబ్‌లో ముంచి చంపేసారా అనే ప్రశ్నలు కూడ వస్తున్నాయి. అయితే ఈ విషయాలపై స్పష్టత కోసం దుబాయ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

English summary
The Dubai police on Monday recorded the statement of Boney Kapoor, husband of Bollywood actor Sridevi who died on Sunday of accidental drowning in her hotel bathtub after losing consciousness, according to a media report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X