వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించలేం: షాకిచ్చిన ఫోరెన్సిక్, ‘మద్యం’పై అనుమానం

|
Google Oneindia TeluguNews

దుబాయ్‌: సినీ నటి శ్రీదేవి మృతదేహం మన దేశానికి తీసుకురావడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. శ్రీదేవి మృతదేహాన్ని సోమవారం భారత్‌కు అప్పగించలేమని దుబాయ్‌ అధికారులు తేల్చి చెప్పడమే ఇందుకు కారణం. ఈ కేసులో మరింత విచారణ అవసరమని దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ అధికారులు తెలిపారు.

కాగా, శ్రీదేవి మృతి కేసును దుబాయ్‌ పోలీసులు..ప్రాసిక్యూషన్‌ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్‌ అధికారి ఒకరు భారతీయ మీడియాతో మాట్లాడారు.

లోతైన విచారణ

లోతైన విచారణ

ఫోరెనిక్స్‌ రిపోర్ట్‌ ఆధారంగా ప్రమాదవశాత్తు జరిగిందేనని ఎలా నిర్ధారిస్తారని సదరు ప్రాసిక్యూషన్ అధికారి ప్రశ్నించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని.. ఆమె మృతిపై మరిన్ని అనుమానాలు ఉన్నాయన్న ఆయన.. లోతైన విచారణ అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

అందమైన కథ ముగిసింది: సినీ, రాజకీయ దిగ్గజాల దిగ్భ్రాంతి, హేమ, సచిన్.. ఏమన్నారంటే..?అందమైన కథ ముగిసింది: సినీ, రాజకీయ దిగ్గజాల దిగ్భ్రాంతి, హేమ, సచిన్.. ఏమన్నారంటే..?

తేల్చి చెప్పిన ఫోరెన్సిక్

తేల్చి చెప్పిన ఫోరెన్సిక్

అంతేగాక, మరిన్ని పత్రాలు కావాలని భారత కాన్సులేట్‌ను కోరినట్లు ఆ అధికారి తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో శ్రీదేవి మృతదేహాన్ని సోమవారం అప్పగించలేమని ఆయన తేల్చేశారు. దీంతో శ్రీదేవి భౌతిక కాయన్ని భారత్‌ తరలించే విషయంపై సందిగ్ధత నెలకొంది.

శ్రీదేవి మృతిపై లోతుగా.! బోనీ కపూర్ నిర్బంధం, పాస్‌పోర్ట్ సీజ్: ఏం జరుగుతోంది?శ్రీదేవి మృతిపై లోతుగా.! బోనీ కపూర్ నిర్బంధం, పాస్‌పోర్ట్ సీజ్: ఏం జరుగుతోంది?

షాకిచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్

షాకిచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్

శ్రీదేవి మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారమే ఆమె మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీదేవీ మృతిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ యూఏఈ ఆరోగ్యశాఖ సోమవారం ఫోరెన్సిక్‌ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి నీటి టబ్‌లో పడిపోవడం వల్లే మృతి చెందినట్టు పేర్కొంది. అయితే శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్‌ను గుర్తించినట్టు యూఏఈ రిపోర్టు పేర్కొది. అయితే ఆమెకు గుండెపోటు వచ్చిందనే విషయాన్ని ఫోరెన్సిక్‌ నివేదికలో ప్రస్తావించలేదు.

సినిమాలంటే ప్రాణం: శ్రీదేవి మరణంతో తిరుపతిలో విషాదం, బంధువుల కన్నీటిపర్యంతంసినిమాలంటే ప్రాణం: శ్రీదేవి మరణంతో తిరుపతిలో విషాదం, బంధువుల కన్నీటిపర్యంతం

బోనీ కపూర్ సుదీర్ఘ విచారణ

బోనీ కపూర్ సుదీర్ఘ విచారణ

ఇది ఇలావుంటే శ్రీదేవి భర్త బోనీ కపూర్‌‌ను మూడు గంటలపాటు విచారణ చేపట్టిన పోలీసులు.. కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు దుబాయ్‌ విడిచివెళ్లరాదని బోనీకపూర్‌‌కు ప్రాసిక్యూషన్‌ అధికారులు తెలిపినట్లు సమాచారం.

సిద్ధి వినాయక ఆలయంలో వేదనగా, కంటతడి, తెలుగువారంటే..: ‘ఆలస్యం'పై ఫ్యాన్స్ అసహనంసిద్ధి వినాయక ఆలయంలో వేదనగా, కంటతడి, తెలుగువారంటే..: ‘ఆలస్యం'పై ఫ్యాన్స్ అసహనం

మద్యంపై అనుమానాలు

మద్యంపై అనుమానాలు

కాగా, శ్రీదేవి మృతిపై రాజ్యసభ ఎంపీ అమర్‌ సింగ్‌ అనుమానం వ్యక్తం చేశారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదని ఆయన తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె వైన్‌ మాత్రం తీసుకునేవారని అమర్‌ సింగ్‌ తెలిపారు. అలాంటప్పుడు శ్రీదేవి రక్త నమునాల్లో మద్యం అవశేషాలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఆమె మృతిపై లోతైన విచారణ చేపట్టాలన్నారు.

యువరాజుతో అమర్ సింగ్

యువరాజుతో అమర్ సింగ్

శ్రీదేవి మృతి ఘటనపై అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్ జాయెద్‌ అల్‌ నహ్యాన్తో తాను మాట్లాడినట్లు అమర్‌ సింగ్‌ తెలిపారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి, శ్రీదేవి మృతదేహాన్ని భారత్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆమె భౌతికకాయం సోమవారం రాత్రికి ముంబై చేరే అవకాశం ఉన్నట్లు అమర్‌ సింగ్‌ చెప్పారు.

English summary
Bollywood superstar Sridevi died of drowning in the bathtub of room number 2201 Jumeirah Emirates Towers Hotel after loss of consciousness, the Dubai Police stated on Monday following the completion of post-mortem analysis of the actress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X