వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కుముడులు వీడినట్లే!: ఎట్టకేలకు శ్రీదేవి బాడీ అప్పగింతకు దుబాయ్ ప్రాసిక్యూషన్ ఓకే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi's Last Rites : Sridevi's Body To Reach Mumbai By Evening

దుబాయ్: హోటల్లో మృతి చెందిన శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించేందుకు దుబాయ్ ప్రాసిక్యూషన్ మంగళవారం అనుమతించింది. ప్రాసిక్యూషన్ నిర్ణయంతో చిక్కుముడులు వీడే అవకాశముంది. శ్రీదేవి కుటుంబ సభ్యులకు, భారత అధికారులకు ప్రాసిక్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది. మృతదేహం రిలీజ్ లెటర్ అందినట్లు భారత కార్యాలయం ధృవీకరించింది.

బాత్‌టబ్‌లో పడితే: శ్రీదేవిపై అనుమానాలకు సమాధానాలు!! అందుకే ఎన్నో డౌట్స్బాత్‌టబ్‌లో పడితే: శ్రీదేవిపై అనుమానాలకు సమాధానాలు!! అందుకే ఎన్నో డౌట్స్

శ్రీదేవి మృతిపై మీడియాలో వివిధ రకాలుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దుబాయ్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. శ్రీదేవి మృతిపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

దుబాయ్ పోలీసులు ఇలా

దుబాయ్ పోలీసులు ఇలా

భారతీయ నటి శ్రీదేవి మృతి అందరినీ షాక్‌కు గురి చేసిందని, కానీ ఎందుకు ఏవేవో ఊహించుకుంటూ ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారని, దుబాయ్‌ అధికారుల విచారణ పూర్తికాకుండానే భారత్‌కి చెందిన కొన్ని మీడియా వర్గాలు ఈ కేసులో న్యాయమూర్తిగా వ్యవహరించాలని చూస్తున్నాయని దుబాయ్ పోలీసులు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.

నిజాలు తెలుసుకుంటున్నారు

నిజాలు తెలుసుకుంటున్నారు

అధికారులు నిజానిజాలు తెలుసుకుంటున్నారని, బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం వల్లే శ్రీదేవి చనిపోయిందని ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైందని, భారత్‌కు చెందిన మీడియాకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నామని, ఇలాంటి సమయంలో కాస్త ఓపిక పట్టాలని దుబాయ్‌ పోలీసులు అన్నారు.

 ఇలా సహజమే

ఇలా సహజమే

దుబాయ్ సీనియర్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. దుబాయ్‌లో అందరిలాగే శ్రీదేవి విషయంలో వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇలాంటి దర్యాఫ్తు సహజమే అన్నారు. విచారణ అనంతరం నిజాలు తెలుస్తాయని చెప్పారు. కేసుకు సంబంధించి అందరినీ విచారిస్తామన్నారు.

 రీపోస్టుమార్టం లేనట్లే

రీపోస్టుమార్టం లేనట్లే

శ్రీదేవి భౌతిక కాయం తీసుకునేందుకు ఇప్పటికే అర్జున్ కపూర్ దుబాయ్ చేరుకున్నారు. శ్రీదేవి మృతదేహాన్ని కాసేపట్లో ఎంబామింగ్‌కు పంపింస్తారు. ఆ తర్వాత అప్పగిస్తారు. తాజాగా, ప్రాసిక్యూషన్ నిర్ణయంతో రీపోస్టుమార్టం లేనట్లే.

రేపు అంత్యక్రియలు

రేపు అంత్యక్రియలు

శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్ చేసిన అనంతరం భారత్‌కు అప్పగిస్తారు. ఆ తర్వాత దుబాయ్ నుంచి భారత్ బయలుదేరుతారు. భారత్ వచ్చేందుకు నాలుగైదు గంటల సమయం పడుతుంది. బుధవారం అంత్యక్రియలు జరిగే అవకాశముంది. ఎంబామింగ్‌కు మూడు నాలుగు గంటలు పడుతుంది. ఆ తర్వాత అప్పగిస్తారు.

English summary
The mortal remains of Bollywood actor Sridevi are expected to reach India on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X