వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి హెల్త్‌రిపోర్ట్స్ కోరిన దుబాయ్ పోలీసులు, బోనికపూర్ ఏం చెప్పాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శ్రీదేవి మరణంపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ చేస్తోంది. శ్రీదేవి మృతికి సంబందించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై కూడ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో మరోసారి రీ పోస్ట్ మార్టం చేస్తారా అనే ప్రశ్నలు కూడ ఉత్పన్నమౌతున్నాయి. శ్రీదేవి హెల్త్‌ రికార్డులను పంపాలని కూడ దుబాయ్ పోలీసులు ముంబైకి సమాచారాన్ని పంపారు. మరో వైపు మొహిత్ మార్వా కుటుంబసభ్యులను కూడ దుబాయ్ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.మరో వైపు శ్రీదేవి భర్త బోనికపూర్ స్టేట్‌మెంట్‌ను దుబాయ్ పోలీసులు రికార్డ్ చేసినట్టు దుబాయ్ మీడియా ప్రకటించింది. అయితే ఆ స్టేట్‌మెంట్‌లో ఏముందనేది కీలకంగా మారింది.

Recommended Video

Sridevi Passes Away : అందమే శాపమైందా, అవే ప్రాణాలకు ముప్పు తెచ్చాయా?

శ్రీదేవి బౌతిక కాయం తరలింపుకు ఆలస్యం, ఎందుకంటే? శ్రీదేవి బౌతిక కాయం తరలింపుకు ఆలస్యం, ఎందుకంటే?

ఫిబ్రవరి 24వ, తేదిన సాయంత్రం శ్రీదేవి మరణించిందని నిపుణులు గుర్తించారు. అయితే శ్రీదేవి మరణానికి సంబందించి ఏం జరిగిందనే విషయాలపై దుబాయ్ ప్రాసిక్యూషన్ ఆరా తీస్తోంది. అసలు ఏం జరిగిందనే విషయమై పక్కా సాక్ష్యాలను సేకరించే పనిలో పడ్డారు.

చివరిక్షణాల్లో శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనికపూర్, దుబాయ్‌‌లో అంతేచివరిక్షణాల్లో శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనికపూర్, దుబాయ్‌‌లో అంతే

శ్రీదేవి భౌతికకాయానికి మరోసారి రీ పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తారనే ప్రచారం కూడ సాగుతోంది.అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. శ్రీదేవి మరణంపై వాస్తవాలు నిర్ధారణ అయితేనే బౌతికకాయాన్ని ముంబైకి తరలించేందుకు అనుమతిస్తారు.

మొహిత్ మార్వా కుటుంబాన్ని విచారించే అవకాశం

మొహిత్ మార్వా కుటుంబాన్ని విచారించే అవకాశం

దుబాయ్‌లో మోహిత్ మార్వా వివాహనికి భర్త బోనికపూర్, చిన్నకూతురు ఖుషీతో కలిసి వెళ్ళింది. అయితే వివాహమైన తర్వాత చిన్న కూతురితో కలిసి బోనికపూర్ ముంబైకి తిరిగి వచ్చాడు. అయితే షాపింగ్‌ కోసం శ్రీదేవి అక్కడే ఉందని చెబుతున్నారు. అయితే మొహిత్ మార్వా కుటుంబసభ్యులను కూడ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. వివాహంలో చోటు చేసుకొన్న పరిణామాలు ఏమైనా శ్రీదేవి మరణానికి సంబంధం ఉందా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ విషయమై మార్వా కుటుంబసభ్యులను కూడ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.

పోస్ట్ మార్టం రిపోర్ట్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసంతృప్తి

పోస్ట్ మార్టం రిపోర్ట్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసంతృప్తి

శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్ మార్టం రిపోర్ట్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో మరోసారి శ్రీదేవి బౌతిక కాయానికి రీ పోస్ట్ మార్టం నిర్వహిస్తారా అనే చర్చ కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

శ్రీదేవి హెల్త్ రికార్డ్స్ పంపాలని కోరిన పోలీసులు

శ్రీదేవి హెల్త్ రికార్డ్స్ పంపాలని కోరిన పోలీసులు

సినీ నటి శ్రీదేవి హెల్త్ రికార్డ్స్‌ పంపాలని దుబాయ్ పోలీసులు కోరినట్టు సమాచారం. సినీ నటిగా సుదీర్ఘకాలంగా ఉన్న శ్రీదేవి తన అందాన్ని కాపాడుకొనేందుకు పలు రకాల శస్త్రచికిత్సలు చేయించుకొన్నారని సినీ పరిశ్రమలో ప్రచారంలో ఉంది. అయితే ఈ చికిత్సల కారణంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు తతెత్తాయా, అసలు శ్రీదేవి ఇప్పటి వరకు ఏ రకమైన చికిత్సలు చేయించుకొన్నారనే విషయమై తెలుసుకొనేందుకు శ్రీదేవి హెల్త్ రికార్డ్స్‌ను పంపాలని దుబాయ్ పోలీసులు ముంబైకి సమాచారం పంపారని సమాచారం.

మార్చురీలోనే మృతదేహం

మార్చురీలోనే మృతదేహం

దుబాయ్‌ పోలీస్ హెడ్‌క్వార్టర్‌లోనే శ్రీదేవి మృతదేహం ఉంది. ఈ కేసు కొలిక్కి వచ్చేవరకు మృతదేహన్ని కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశాలు లేవు. ఈ కేసు విషయమై శ్రీదేవి బస చేసిన హోటల్ సిబ్బందితో పాటు శ్రీదేవి భర్త బోనికపూర్‌ను కూడ పోలీసులు మరోసారి విచారించే అవకాశం ఉంది. అప్పటివరకు శ్రీదేవి మృతదేహం మార్చురీలోనే ఉంటుంది.

బోనికపూర్ స్టేట్ మెంట్ రికార్డ్

బోనికపూర్ స్టేట్ మెంట్ రికార్డ్

బోనికపూర్ స్టేట్‌మెంట్‌ను దుబాయ్ పోలీసులు రికార్డ్ చేశారు. శ్రీదేవి మరణానికి ముందు, ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై బోనికపూర్‌ నుండి సమాచారాన్ని తీసుకొన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆ స్టేట్‌మెంట్‌లో బోనికపూర్ ఏం చెప్పారనేది ప్రస్తుతం కీలకంగా మారింది. హోటల్‌లో చోటు చేసుకొన్న పరిణామాలపై బోనికపూర్ చెప్పిన స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు సరిచూసుకొంటున్నారు మరోసారి శ్రీదేవి భర్త బోనికపూర్‌ను విచారించే అవకాశం ఉందని సమాచారం.

English summary
In the aftermath of the demise of veteran actor Sridevi, the police recorded the statement of her husband and noted producer Boney Kapoor, the Gulf News reported on late Monday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X