వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గుడ్ బై టు శ్రీదేవి' అంటూ ప్రభుత్వ లాంఛనాలతో: రోజుల తరబడి ఏడుస్తూ కూతురు జాన్వీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi Mortal being taken for Cremation, Watch Video

ముంబై: బాలీవుడ్ నటి శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెను చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు తరలి వచ్చారు.

శ్రీదేవి తెలియదు.. అప్పటిదాకా గుర్తించలేదు: దుబాయ్‌లో కేరళ వ్యక్తి సాయంశ్రీదేవి తెలియదు.. అప్పటిదాకా గుర్తించలేదు: దుబాయ్‌లో కేరళ వ్యక్తి సాయం

దీంతో ఏడు కిలో మీటర్లకు పైగా అంతిమయాత్ర కనిపించింది. సాయంత్రం ఐదు గంటలకు విల్లా పార్లే హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

శ్రీదేవి కోరిక మేరకు

శ్రీదేవి కోరిక మేరకు అంతిమయాత్రకు ఉపయోగించే వాహనం మొత్తం వివిధ రకాల తెల్లపూలతో అలంకరించారు. వాహనం లోపల శ్రీదేవి ఫోటోను ఉంచారు. ఆ ఫోటో చుట్టూ తెల్లటి పూలను అలంకరించారు. వాహనాన్ని పూలతో అలంకరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అంతిమయాత్రలో ఫ్యామిలీ

శ్రీదేవి అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బోనీకపూర్, అర్జున్ కపూర్, జాన్వీ, ఖుషీ తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి భౌతికకాయం దుబాయ్‌లో ఉన్నప్పటి నుంచి కూతురు జాన్వీ ఏడుస్తూనే ఉంది. ఆమె 72 గంటలుగా ఏడుస్తున్నట్లు మంగళవారం మధ్యాహ్నం చెప్పారు. శ్రీదేవిని చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

గుడ్ బై టు శ్రీదేవి

వేలాది మంది శ్రీదేవి అభిమానులు అంతిమయాత్ర సందర్భంగా తరలి వచ్చారు. ముంబై వీధుల్లోను పలువురు అభిమానులు.. గుడ్ బై టు శ్రీదేవీ అంటూ ఉద్వేగంతో అన్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో

శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె పై మువ్వన్నెల జెండా కప్పారు. ముంబై బ్రాండ్ పోలీసులు సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర ప్రారంభమైంది.

తమిళనాడులో సంతాపం

తమిళనాడులో శ్రీదేవి కుటుంబం నిర్వహిస్తున్న ఓ ప్రైమరీ పాఠశాలలో ఆమెకు నివాళులు అర్పించారు. ఆమె పుట్టిన ప్రాంతమైన శివకాశీలోను నివాళులు అర్పించారు.

రోడ్డుపై కంటతడి పెడుతూ అభిమానులు

రోడ్డుపై కంటతడి పెడుతూ అభిమానులు

శ్రీదేవి అంతిమయాత్రలో పాల్గొన్న చాలామంది అభిమానులు, సినీ తారలు కంటతడి పెట్టారు. చాలామంది అక్కడ ఏడుస్తూ కనిపించారు. భౌతికకాయం విల్లాపార్లే స్మశాన వాటిక చేరుకునేసరికి అప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

English summary
Bollywood actor Sridevi cremated according to state honours at Mumbai’s Vile Parle Seva Samaj Crematorium on Wednesday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X