వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవికి అదంటే చెప్పలేనంత ఇష్టం: త్వరలో వేలానికి ఆ రెండూ!..

|
Google Oneindia TeluguNews

ముంబై: శ్రీదేవి మరణం అభిమానులకు ఇంకా షాక్ లాగే ఉంది. ఆమె అంత్యక్రియలు పూర్తయినప్పటికీ.. భౌతికంగా ఆమె లేరన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఇప్పుడామె జ్ఞాపకాల్లో మునిగితేలుతున్నారు.

సోషల్ మీడియాలోనూ, ఇంటర్నెట్ లోనూ ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలపై పెద్ద ఎత్తునే చర్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, ఆమె అభిరుచులకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి.

ఆ ఒక్కడే లేకపోయి ఉంటే?..: శ్రీదేవి విషయంలో అన్నీ తానై.. సలాం కొట్టాల్సిందే!ఆ ఒక్కడే లేకపోయి ఉంటే?..: శ్రీదేవి విషయంలో అన్నీ తానై.. సలాం కొట్టాల్సిందే!

 శ్రీదేవి చిత్రకారిణి కూడా..:

శ్రీదేవి చిత్రకారిణి కూడా..:

శ్రీదేవిలో నటి మాత్రమే కాదు, చాలామందికి తెలియని ఒక చిత్రకారిణి కూడా ఉన్నారు. ఖాళీ సమయాల్లో ఆమె బ్రష్ చేతబట్టి పెయింటింగ్ వేసేవారు. అలా ఓసారి సోనమ్ కపూర్ చిత్రాన్ని అద్భుతంగా పెయింట్ చేశారు. 'సావరియా' చిత్రంలో సోనమ్ కపూర్ కు సంబంధించిన ఓ స్టిల్ ఆమెను బాగా ఆకట్టుకోవడంతో.. ఈ చిత్రాన్ని గీశారు.

 వేలానికి ఆ రెండూ..:

వేలానికి ఆ రెండూ..:

మరో సందర్భంలో పాప్‌స్టార్‌ మైఖెల్‌ జాక్సన్‌ బొమ్మను కూడా గీశారు. శ్రీదేవి గీసిన సోనమ్ కపూర్, మైఖెల్ చిత్రాలను త్వరలోనే దుబాయ్‌లో వేలానికి పెట్టనున్నారు.

నిజానికి 2010లోనే దుబాయ్‌కి చెందిన ఇంటర్నేషనల్ ఆర్ట్‌ హౌస్‌ పెయింటింగ్స్ వేలం కోసం ఆమెను సంప్రదించారు. కానీ అప్పట్లో శ్రీదేవి ఒప్పుకోలేదు. అయితే వేలంలో వచ్చే డబ్బును ఛారిటీకి విరాళంగా ఇస్తామని చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారట.

 'మైఖెల్' ఆర్ట్ అంటే చెప్పలేనంత ఇష్టం..:

'మైఖెల్' ఆర్ట్ అంటే చెప్పలేనంత ఇష్టం..:

శ్రీదేవి గీసిన పెయింటింగ్స్ లో అన్నింటికంటే మైఖెల్ జాక్సన్ చిత్రమంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టమట. దుబాయ్ వేలంలో ఈ పెయింటింగ్‌ ప్రారంభ వేలాన్ని రూ.8లక్షలుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

కాగా, ఫిబ్రవరి 25న శ్రీదేవి దుబాయ్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మేనల్లుడు మోహిత్‌ మార్వా వివాహానికి వెళ్లిన శ్రీదేవి అక్కడి ఓ హోటల్ గదిలో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయారు.

 ఎక్కడ సెటిల్ అవాలనుకున్నారు?:

ఎక్కడ సెటిల్ అవాలనుకున్నారు?:

గతంలో శ్రీదేవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాజాగా మరోసారి వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో 'ఎక్కడ సెటిల్ అవుతారు?' అన్న ప్రశ్నకు 'విదేశాల్లో' అని సమాధానం చెప్పారు శ్రీ.

విదేశాల్లో అయితే తనకు నచ్చిన ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ ఫుల్లుగా లాగించేయవచ్చని శ్రీదేవి చెప్పారు. ఇండియాలోనూ ఆ ఛాన్స్ ఉన్నప్పటికీ.. ఇక్కడైతే తనకు అంత తీరిక దొరకదని నవ్వుతూ చెప్పారు.

English summary
Late Bollywood actor Sridevi, who was cremated in Mumbai on Wednesday evening, often painted in her free time and she even had auctions for her art works. A Sonam Kapoor painting by Sridevi has now surfaced and is going viral online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X