వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాత్రూంలోనే శ్రీదేవి.. విషాదం ఇలా!: అతిలోక సుందరి గురించి కొన్ని విషయాలు...

|
Google Oneindia TeluguNews

ముంబై: దుబాయ్‌లో పెళ్లికి హాజరైన నటి శ్రీదేవి కన్నుమూశారు. ఆమె మృతిపై యావత్ భారతం స్పందిస్తోంది! సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు, సామాన్యులు ఇలా అందరూ ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె హఠాత్తుగా మృతి చెందడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

బోనీకపూర్ బంధువు మోహిత్ మార్వా కుటుంబ సభ్యుల పెళ్లి కోసం భర్త బోనీకపూర్, ఓ కూతురుతో కలిసి శ్రీదేవి దుబాయ్ వెళ్లింది. అక్కడ పెళ్లిలో ఆనందంగా కనిపించింది. అయితే అంతలోనే ఆమె మృతి చెంది, అందరిని విషాదంలో ముంచింది.

Recommended Video

హార్ట్ ఎటాక్‌‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!

2013లో శ్రీదేవికి పద్మశ్రీ, ఎన్నో అవార్డులు: సినిమాల్లో స్టార్, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు!2013లో శ్రీదేవికి పద్మశ్రీ, ఎన్నో అవార్డులు: సినిమాల్లో స్టార్, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు!

శ్రీదేవి ఎలా మృతి చెందారంటే

శ్రీదేవి ఎలా మృతి చెందారంటే

శ్రీదేవి బాత్‌రూంలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అమె అక్కడే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపు ఆమె మృతి చెందారు.

సోమవారం అంత్యక్రియలు

సోమవారం అంత్యక్రియలు


శ్రీదేవి మృతదేహం ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముంబైకి చేరుకోనుంది. ముంబై నుంచి ప్రత్యేక విమానం దుబాయికి వెళ్లింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ముంబైకి తిరుగు ప్రయాణం కానుంది.

అల్లుడి వివాహం కోసం వెళ్లారు

అల్లుడి వివాహం కోసం వెళ్లారు

అల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం కుటుంబంతో కలిసి శ్రీదేవి దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని దుబాయ్‌లోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, అంధేరీలోని ఆమె ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీదేవి మృతిపై యూఏఈ అంబాసిడర్

శ్రీదేవి మృతిపై యూఏఈ అంబాసిడర్

శ్రీదేవి మృతిపై యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సురీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదిక పనిలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. తాము సహాయం చేసేందుకు కుటుంబ సభ్యులు, స్థానికులతో టచ్‌లో ఉన్నామని చెప్పారు.

హిందీలో తొలి సూపర్ స్టార్

హిందీలో తొలి సూపర్ స్టార్

శ్రీదేవి 1963 ఆగస్టు 13వ తేదీన జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్. తన నాలుగేళ్ల వయస్సులోనే సినిమా రంగంలోకి ఆరంగేట్రం చేశారు. హిందీ సినిమాలో సూపర్ స్టార్ ట్యాగ్ పొందిన తొలి హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవి తండ్రి లాయర్.

కెరీర్‌కు ఎంతో ఉపయోగం

కెరీర్‌కు ఎంతో ఉపయోగం

ఆమెకు తొలి నాళ్లలో హిందీ అంత బాగా రాదు. బాలీవుడ్ తొలి సినిమా సమయానికి హిందీ అంత మాట్లాడలేకపోయేవారు. నాజ్ డబ్బింగ్ ఎక్కువగా చెప్పేవారు. రేఖ కూడా డబ్బింగ్ చెప్పారు. చాందిని సినిమాలో శ్రీదేవి తొలిసారి డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమాలో డబ్బింగ్, ఆ తర్వాత నాగిన సినిమాలో జయప్రద నటించాల్సిన సినిమాలో శ్రీదేవి నటించింది. ఈ రెండు ఆమె కెరీర్‌కు ఉపయోగపడ్డాయి.

తమిళంలో కమల్‌తో ఎక్కువ సినిమాలు

తమిళంలో కమల్‌తో ఎక్కువ సినిమాలు

తమిళంలో ఆమె కమల్ హాసన్‌తో ఎక్కువ సినిమాలు నటించారు. శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి సినిమాల్లో నటించారు. 2013లో శ్రీదేవికి పద్మశ్రీ వచ్చింది. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.

English summary
Right now, police are engaged in forensics report. We are in touch with the family & local authorities to provide all possible assistance: Indian Ambassador to UAE Navdeep Singh Suri on Sridevi death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X