వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చివరిక్షణాల్లో శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనికపూర్, దుబాయ్‌‌లో అంతే

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi Passes Away : శ్రీదేవి నీటిలో మునిగి? అంతా ఆ 30 నిమిషాల్లోనే.. ?

న్యూఢిల్లీ: తన సతీమణి శ్రీదేవిని సర్‌ప్రైజ్ చేద్దామనుకొన్నాడు భర్త బోనికపూర్. వివాహనికి హజరై దుబాయ్ నుండి ముంబైకి వచ్చిన బోనికపూర్ తిరిగి దుబాయ్‌కు వెళ్ళి శ్రీదేవిని ఆశ్చర్యపరిచాడుఅయితే ఆ తర్వాత కొద్ది క్షణాలకే ఆమె మరణించింది. మరో వైపు దుబాయ్‌లోని కఠిన నిబంధనల కారణంగా శ్రీదేవి బౌతిక కాయం ముంబై తరలింపుకు ఆలస్యమౌతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

శ్రీదేవి బౌతిక కాయం తరలింపుకు ఆలస్యం, ఎందుకంటే?శ్రీదేవి బౌతిక కాయం తరలింపుకు ఆలస్యం, ఎందుకంటే?

దుబాయ్‌లో బంధువుల వివాహనికి హజరైన సినీ నటి శ్రీదేవి గుండెపోటుతో మరణించారు. ఆమె మరణంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.కడసారి చూపు కోసం శ్రీదేవి పార్థీవ దేహం కోసం బంధువులు, స్నేహితులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు.

చనిపోవడానికి కొన్ని గంటల ముందు శ్రీదేవికి భర్త బోనికపూర్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత శ్రీదేవి సర్‌ప్రైజ్ ఇచ్చింది. గుండెపోటుతో మరణించి అభిమానులకు విషాదంలో ముంచెత్తింది.

ఆ ఇద్దరికీ ఆ కోరిక తీరలేదు, శ్రీదేవి కుటుంబంలో విచిత్రంఆ ఇద్దరికీ ఆ కోరిక తీరలేదు, శ్రీదేవి కుటుంబంలో విచిత్రం

శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనికపూర్

శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనికపూర్

శ్రీదేవి హఠాన్మరణానికి ముందు భర్త బోనీ కపూర్ ఆమెను ‘సర్‌ప్రైజ్' చేద్దామనుకున్నాడని భావించాడు. దుబాయ్ నుండి ముంబైకి వచ్చిన బోనికపూర్ శ్రీదేవికి చెప్పకుండానే తిరిగి దుబాయ్‌కి వెళ్ళిపోయాడు. మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ చేరుకున్న శ్రీదేవి దంపతులు అక్కడి జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేశారు. ఆ రాత్రికి శ్రీదేవికి అద్భుతమైన డిన్నర్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దామని భర్త బోనీ భావించాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.. ఈ విషయం ఆమెకు ముందే చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు. డిన్నర్‌కు ముందు నిద్రపోతున్న శ్రీదేవిని లేపి 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు.బోనికపూర్‌ను చూసిన శ్రీదేవి ఆశ్చర్యపోయారంటున్నారు.

బాత్‌రూమ్‌లోనే అచేతనంగా

బాత్‌రూమ్‌లోనే అచేతనంగా

రాత్రిపూట బోజనానికి వెళ్ళాలని భర్త బోనికపూర్ చెప్పడంతో స్నానం చేసేందుకు శ్రీదేవి వాష్‌రూమ్‌కు వెళ్ళింది. అయితే వాష్‌రూమ్‌ నుండి ఆమె ఎంతకు తిరిగి రాకపోవడంతో బోని కపూర్ తలుపులు కొట్టాడు. అయినా స్పందించలేదు. హోటల్ రూమ్ సిబ్బంది సహయంతో తలుపులు బద్దలు కొట్టి చూస్తే బాత్‌టబ్‌లో శ్రీదేవి అచేతనంగా పడి ఉంది. వైద్యులు వచ్చి శ్రీదేవిని పరీక్షించి చూస్తే అప్పటికే ఆమె మరణించారని ప్రకటించారు. శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇచ్చి బోనికపూర్ సక్సెస్ అయ్యారు. కానీ, శ్రీదేవి ప్రపంచానికి సర్ ప్రైజ్ ఇచ్చింది.

దుబాయ్‌లో నిబంధనలు కఠినం

దుబాయ్‌లో నిబంధనలు కఠినం

దుబాయ్‌లోని చట్టాల కారణంగానే శ్రీదేవి మృతదేహం ముంబైకి తరలించేందుకు ఆలస్యమౌతోందని అధికారులు చెబుతున్నారు. సామాన్యులకు, విఐపీలను కూడ ఒకే రకంగా అక్కడి అధికారులు పరిగణిస్తారు. ఆ దేశ పద్దతుల ప్రకారంగానే నడుచుకొంటారు. ఇదే ప్రస్తుతం శ్రీదేవి పార్ధీవదేహం దుబాయ్ నుండి ముంబైకి తరలించడానికి ఆలస్యమౌతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.దుబాయ్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు తరలించే వందలాది మృతదేహాలను అల్‌ ఖుసే్‌సలోని పోలీసు మార్చురీలోనే భద్రపరుస్తారు. సెలబ్రిటీ అయిన శ్రీదేవి భౌతిక కాయాన్ని కూడా అక్కడే భద్రపరిచారు. ఫోరెన్సిక్‌ పరీక్షలు పూర్తయిన తర్వాతే ఆమె పార్థివ దేహాన్ని అప్పగిస్తామని అక్కడి పోలీసులు తేల్చి చెప్పారు. పోస్టుమార్టం, ఇతర వైద్య పరీక్షలు పూర్తయ్యే సరికే కార్యాలయ పని వేళలు ముగిశాయి. దాంతో, పరీక్ష నివేదికలను పూర్తిగా అధ్యయనం చేయనిదే తుది నివేదికను జారీ చేయలేనని వాటిని నిర్వహించిన డాక్టర్‌ ఖాలీద్‌ అల్‌ అబురైఖీ స్పష్టం చేశారు. డాక్టర్ల నివేదిక రాకుండా మృతదేహాన్ని తాము అప్పగించలేమని పోలీసులు చెప్పారు.

దుబాయ్ చట్టాల ఏం చెబుతున్నాయి

దుబాయ్ చట్టాల ఏం చెబుతున్నాయి

మరణం ఎలా సంభవించినా పోలీసులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలనే నిబంధన దుబాయ్‌లో ఉంది. మృతదేహాన్ని అల్‌ రాషేద్‌ ఆస్పత్రి లేదా అల్‌ ఖుసేస్‌ మార్చురీకి తరలిస్తారు. చికిత్స పొందుతూ మరణిస్తే ఆస్పత్రుల మార్చురీలో భద్రపరుస్తారు. ఫోరెనిక్స్‌ నిపుణులు మృతదేహాన్ని పరీక్షిస్తారు. అనేక సందర్భాల్లో పోస్టుమార్టం చేస్తారు. ఆ తర్వాత మరణానికి కారణాలను విశ్లేషిస్తూ నివేదిక జారీ చేస్తారు. మృతుల పాస్‌పోర్టు, వీసా పరిశీలించి పోలీసులు ధ్రువీకరిస్తారు. ధ్రువీకరణను పోలీసులకు అందిస్తే, వారు మృతదేహాలను అప్పగించాలని నాలుగు పత్రాలను ఆస్పత్రి, ఎయిర్‌లైన్స్‌, మృతదేహాన్ని రసాయనాలతో ప్యాకింగ్‌ (ఎంబాలింగ్‌) చేసే విభాగం, విమానాశ్రయం లేదా శ్మశాన వాటికకు జారీ చేస్తారు. వాటిని ఆస్పత్రిలో అందిస్తే, అది మరణ ధ్రువీకరణను అరబ్బీ భాషలో జారీ చేస్తుంది. దానిని వీసా వ్యవహారాల కార్యాలయంలో అందిస్తే వీసా రద్దు చేస్తారు.

English summary
Indian embassy officials here are working closely with the local authorities to ensure that the mortal remains of Bollywood icon Sridevi, who passed away in Dubai last night, is taken to Mumbai on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X