వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నాలుగు రోజులు శ్రీదేవి ఏం చేసింది, అంతా మిస్టరీ?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దుబాయ్‌లో మరణించిన ప్రముఖ నటి శ్రీదేవి మృతదేహనికి మంగళవారం నాడు ఎంబామింగ్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. ఎంబామింగ్ చేస్తే మృతదేహం ఎన్ని రోజులైనా పాడు కాకుండా ఉంటుంది.

Recommended Video

వీడిన శ్రీదేవి మృతి మిస్టరీ !

శ్రీదేవి హెల్త్‌రిపోర్ట్స్ కోరిన దుబాయ్ పోలీసులు, బోనికపూర్ ఏం చెప్పాడుశ్రీదేవి హెల్త్‌రిపోర్ట్స్ కోరిన దుబాయ్ పోలీసులు, బోనికపూర్ ఏం చెప్పాడు

మరోవైపు వివాహమైన తర్వాత నాలుగు రోజుల పాటు శ్రీదేవి దుబాయ్‌లో ఏం చేసిందనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీదేవి తిరిగేందుకు కారును ఎవరు సమకూర్చారనే విషయమై ఆరా తీస్తున్నారు. శ్రీదేవి మరణానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

శ్రీదేవి డెత్ మిస్టరీ: బోనికపూర్ దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడు, ఆ 3 గంటల్లో ఏం జరిగింది?శ్రీదేవి డెత్ మిస్టరీ: బోనికపూర్ దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడు, ఆ 3 గంటల్లో ఏం జరిగింది?

ఫిబ్రవరి 24వ, తేదిన శ్రీదేవి దుబాయ్‌లోని హోటల్‌ రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసును దుబాయ్ పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అప్పగించారు.

శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసు విషయమై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతృప్తి చెందేవరకు బౌతికకాయం ముంబైకి తరలి వచ్చే అవకాశమే లేదు.

ఆ నాలుగు రోజులు శ్రీదేవి ఏం చేసింది

ఆ నాలుగు రోజులు శ్రీదేవి ఏం చేసింది


దుబాయ్‌లో ఫిబ్రవరి 20వ, తేదిన మొహిత్ మార్వా వివాహం జరిగింది. అయితే శ్రీదేవి ఫిబ్రవరి 24వ, తేదిన మరణించింది. వివాహమైన తర్వాత బోనికపూర్ చిన్న కూతురితో కలిసి ముంబైకి తిరిగి వచ్చాడు. కానీ, శ్రీదేవి దుబాయ్‌లోనే ఉండిపోయింది. అయితే దుబాయ్‌లోని బోనికపూర్ స్నేహితుడు శ్రీదేవి తిరిగేందుకు కారును సమకూర్చాడని చెబుతున్నారు. అయితే నాలుగు రోజులుగా ఆమె ఎక్కడికి తిరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆ అధికారం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఉంది

ఆ అధికారం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఉంది

బౌతిక కాయం నిలిపివేసే అధికారం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఉంటుందని న్యాయవాది అనురాధ చెబుతున్నారు. ప్రవాసుల మరణాలకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో ఎవరూ కూడ జోక్యం చేసుకోలేరని ఆమె చెప్పారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కేసును లోతుగా విచారించాలని నిర్ణయం తీసుకొంటే బౌతిక కాయానికి రీ పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు.

శ్రీదేవి మృతదేహానికి నేడు ఎంబామింగ్

శ్రీదేవి మృతదేహానికి నేడు ఎంబామింగ్


శ్రీదేవి మృతదేహనికి మంగళవారం నాడు ఎంబామింగ్ చేసే అవకాశం ఉంది. మృతదేహన్ని ఎంబామింగ్ చేస్తే పాడు కాకుండా ఉంటుంది.నిజానికి సోమవారం నాడే శ్రీదేవి భౌతిక కాయానికి ఎంబామింగ్ చేయాలసి భావించినా, సాధ్యం కాలేదు.దీంతో మంగళవారం మధ్యాహ్నం ఎంబామింగ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఆస్తుల గొడవలు

ఆస్తుల గొడవలు

బోనికపూర్ మొదటి భార్యా మోనాకపూర్, శ్రీదేవికి మధ్య ఆస్తుల గొడవలున్నాయనే ప్రచారం ఉంది. మోనాకపూర్ మరణం తర్వాత మోనాకపూర్ పేరున ఓ బంగ్లా ఉంది. శ్రీదేవి ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు ఆమె పేరునే ఉంది. అయితే మొదటి భార్యకు మధ్య ఆస్తుల గొడవలున్నాయని ప్రచారం కూడ సాగుతోంది. అయితే శ్రీదేవి మరణానికి ఆస్తుల గొడవలు కూడ కారణమయ్యాయనే అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
Sridevi’s sad and sudden demise has left the entire nation numb and much to everyone’s shudder, the developments in the case only elevate the shock wave.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X