• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Mafia Don: దేశాన్ని గడగడలాడించి కుక్కచావు, ఫ్రెండ్ భార్యపై మోజు, స్వర్గం చూపించింది, పక్కాప్లాన్ తో

|

బెంగళూరు/ చెన్నై/ కొలంబో: బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమిత్ బచ్చన్, షారుక్ ఖాన్, సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, బాహుబలి ప్రభాస్ నటించిన బిల్లా సినిమా స్టోరీలో లాగే ఓ డాన్ ను అతని ఫ్రెండ్ ప్రియురాలు ఎలా చంపాలనుకుంటుందో అచ్చం అలాగే శ్రీలంకలో పేరుమోసిన గ్యాంగ్ లీడర్ ను ఓ మహిళ చంపేసింది. తన భర్తను చంపాడని కసితో రగిలిపోయిన ఆ మహిళ అతనితో సన్నిహితంగా ఉంటూ ప్రతిరోజు స్వర్గం చూపించింది. ఓ మంచిరోజు చూసి అతను తాగుతున్న విస్కీలో విషం కలిపి పక్కాప్లాన్ తో మాఫియా డాన్ ను చంపేసింది. పేరుమోసిన మాఫియా డాన్ ఓ మహిళ చేతిలో అంతం అయ్యాడని తెలుసుకున్న ఆ గ్యాంగ్ లోని ముఠా సభ్యులు షాక్ కు గురైనారు.

Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !

 శ్రీలంక మాఫియా డాన్

శ్రీలంక మాఫియా డాన్

భారత్ పొరుగు దేశం అయిన శ్రీలంకకు చెందిన చందన లసంత పెరెరా అలియాస్ అంగోడా లోక్కా అండర్డ్ వరల్డ్ డాన్ గా పేరుపొందాడు. అసలు పేరు చందన లసంత పెరెరా కంటే అంగోడా లోక్కా అంటే శ్రీలంకలో అండర్ వరల్డ్ మాఫీయాలో చాలా ప్రత్యేక పేరు, గుర్తింపు ఉంది. శ్రీలంకలో చాలా సంవత్సరాల పాటు అంగోడా లోక్కా చెలరేగిపోయాడు.

 ఒకేసారి 7 మంది దారుణ హత్య

ఒకేసారి 7 మంది దారుణ హత్య

శ్రీలంకలో మాఫియా ముఠాను ఏర్పాటు చేసిన సంఘవ్యతిరేక కార్యకలాపాలు సాగించే అంగోడా లోక్కాపై ఆదేశ ప్రభుత్వం నిఘా వేసింది. 2017లో శ్రీలకంలోని కలుతారా ఉత్తర భాగంలో జైలు నుంచి తన ప్రత్యర్థులను కోర్టుకు తీసుకెలుతున్నారని అంగోడా లోక్కాకు సమాచారం అందింది. ఆ సమయంలో శ్రీలంకలోని జైళ్ల శాఖకు చెందిన వాహనాలపై అంగోడా లోక్కా, అతని అనుచరులు కాల్పులు జరిపి, బాంబులు వేసి 7 మందిని అతి కిరాతకంగా చంపేశాడు.

 శ్రీలంకలో మాయం.... చెన్నైలో ప్రత్యక్షం

శ్రీలంకలో మాయం.... చెన్నైలో ప్రత్యక్షం

ఒకే మతానికి చెందిన 7 మంది హత్యకు గురి కావడంతో శ్రీలంకలో కలకలం రేపింది. శ్రీలంక ప్రభుత్వం అంగోడా లోక్కా కోసం గాలించింది. కనిపిస్తే పోలీసులు కాల్చి చంపేస్తారని అంగోడా లోక్కా భయంతో హడలిపోయాడు. ఆ సమయంలో శ్రీలంక నుంచి తప్పించుకున్న అంగోడా లోక్క సముద్ర మార్గంలో అక్రమంగా చెన్నై చేరుకుని శ్రీలంక శరణార్థులు నివాసం ఉంటున్న ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా తలదాచుకున్నాడు.

 బెయిల్ పై బయటకు వచ్చి ఎస్కేప్

బెయిల్ పై బయటకు వచ్చి ఎస్కేప్

చెన్నై నుంచి శ్రీలంకలో తన మాఫియా ముఠా కార్యకలాపాలను అంగోడా లోక్కా కొనసాగించాడు. ఇదే సమయంలో అంగోడా లోక్కా చెన్నైలో తలదాచుకున్నాడు అనే విషయం తెలుసుకున్న శ్రీలంక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. చెన్నై పోలీసులు అంగోడా లోక్కాను అరెస్టు చేశారు. జైలుకు వెళ్లిన అంగోడా లోక్కా బెయిల్ మీద బయటకు రావడంతో మళ్లీ కొన్ని కేసుల్లో అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే రెండో సారి జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన అంగోడా లోక్కా తమిళనాడు నుంచి ఎస్కేప్ అయ్యాడు.

 బెంగళూరులో ఫ్రెండ్ భార్యపై కన్ను

బెంగళూరులో ఫ్రెండ్ భార్యపై కన్ను

చెన్నై నుంచి తప్పించుకుని బెంగళూరు వచ్చి అక్కడే ఓ అడ్డా తయారు చేసుకున్న అంగోడా లోక్కా మళ్లీ శ్రీలంకలో తన మాఫియా ముఠా కార్యకలాపాలు సాగించాడు. ఇదే సమయంలో బెంగళూరులోని తన ముఖ్యఅనుచరుడు (ఫ్రెండ్) భార్య మీద అంగోడా లోక్కా కన్నుపడింది. ఓ రోజు ముఖ్యఅనుచరుడు, స్నేహితుడిని చంపేసిన అంగోడా లోక్కా అతని భార్యను అదుపులోకి తీసుకుని అప్పటి నుంచి ఆమెతో బలవంతంగా శారీరక సుఖం అనుభవించాడు.

  Taapsee Pannu Counter On Kangana Ranaut ' B - Grade ' Comments | Oneindia Telugu
   బాలీవుడ్ సినిమా స్టైల్లో హత్య ?

  బాలీవుడ్ సినిమా స్టైల్లో హత్య ?

  తన భర్తను చంపి బలవంతంగా అనుభవిస్తున్న మహిళ అంగోడా లోక్కా మీద పగతో రగిలిపోయింది. అయితే అతనికి పూర్తిగా బానిస అయినట్లు కొన్ని నెలల పాటు నటించిన ఆమె అతనికి ఎప్పుడు పడతే అప్పుడు శారీర సుఖం ఇస్తూ స్వర్గం చూపించింది. ఆమెలేని జీవితం ఎందుకు అనే అంతగా అంగోడా లోక్కా ఆమెకు బానిస అయిపోయాడు. ఇటీవల మద్యంలో విషం కలిపి సేవించడంతో అంగోడా లోక్కా తీవ్రఅస్వస్థతకు గురైనాడు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంగోడా లోక్కా మరణించాడని జులై 3వ తేదీన శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందింది.

   ఏం జరిగిందో ఆరా తీస్తున్నాం

  ఏం జరిగిందో ఆరా తీస్తున్నాం

  అంగోడా లోక్కా విషప్రయోగంతో మరణించాడని ప్రచారం జరగడంతో చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం అధికారులు స్పంధించారు. అంగోడా లోక్కా మరణించాడని తమకు అధికారికంగా సమాచారం అందలేదని, ఈ ప్రచారంపై చెన్నై, బెంగళూరు పోలీసులు విచారణ చేస్తున్నారని శ్రీలంక రాయబార కార్యాలయం అధికారులు అంటున్నారు. మొత్తం మీద శ్రీలంకలో మాఫియా డాన్ గా చెలరేగిపోయిన అంగోడా లోక్కా సినిమా స్టైల్లో అతను చంపిన ఫ్రెండ్ భార్య చేతిలో హత్యకు గురి కావడం కలకలం రేపింది.

  English summary
  Mafia Don: Srilanka's criminal gang leader Chandana Lasantha Perera alias ‘Angoda Lokka’ has been mysteriously killed in India.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X