వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్.. అలర్ట్.. అలర్ట్... ఎయిర్‌బేస్‌లపై ఉగ్రవాదుల దాడికి ఛాన్స్, అప్రమత్తం..

|
Google Oneindia TeluguNews

దసరా, దీపావళి పండగవేళ దేశంలో ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా భారత వాయుసేన కేంద్రాలపై ఆత్మాహుతి దాడి చేసే అవకాశం ఉందని డేంజర్ బెల్స్ మోగించాయి. ఐబీ అధికారుల ఆదేశంతో ఆయా ఎయిర్‌పోర్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

బస్‌లో ఆర్డీఎక్స్‌ సరఫరా చేసిన ఉగ్రవాదులు...బస్‌లో ఆర్డీఎక్స్‌ సరఫరా చేసిన ఉగ్రవాదులు...

భారత్‌లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ అధికారులు హెచ్చరించారు. 10 మంది ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. జైషే ఉగ్రవాదులు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని తెలుపడంతో ఎయిర్ పోర్స్ విభాగం అప్రమత్తమైంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, అమృత్‌సర్, శ్రీనగర్, జమ్ముకశ్మీర్‌లోని వాయుసేన కేంద్రాలే టార్గెట్ అని పేర్కొన్నారు.

srinagar, amritsar aisbases high alert on terror attack !!

ఐబీ అధికారుల హెచ్చరికతో శ్రీనగర్, అవంతిపూర్, జమ్ము, పఠాన్‌కోట్, హిందాన్ విమాన స్థావరాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. రెడ్ అలర్ట్ కన్నా ముందు ఆరెంజ్ హెచ్చరిక ఇస్తారు. రెడ్ అలర్ట్ ఇస్తే ఆయా పరిధిలో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలను మూసివేస్తారు. బాలాకోట్ ఉగ్రవాద స్థావరమే కాదు అంతకన్నా ముందు వెళ్లి దాడులు చేస్తామని ఆర్మీ ఛీప్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించిన నేపథ్యంలో ఉగ్రవాద దాడులు చేయొచ్చనే నిఘావర్గాల అంచనా ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
indian Air Force bases in and around Jammu and Kashmir and Punjab have been put on alert after inputs warned of a possible Jaish-e-Mohammed suicide attack on Indian troops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X