వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిసార్ట్ బాత్రూంలో దూరి తప్పించుకున్న ఎమ్మెల్యే: శశికళ వర్గంపై కేసు పెట్టి !

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకేకి చెందిన అందరూ శాసన సభ్యులను శశికళ వర్గీయులు నిర్బంధించారని, వారందరిని రక్షించాలని, తాను అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానని ఆ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు షణ్ముగనాథన్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

<strong>కాసేపట్లో గవర్నర్ కీలక ప్రకటన: ఉత్కంఠలో పన్నీర్, శశికళ!</strong>కాసేపట్లో గవర్నర్ కీలక ప్రకటన: ఉత్కంఠలో పన్నీర్, శశికళ!

శివైకుందమ్ శాసన సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన షణ్మగనాథన్ శుక్రవారం శశికళ వర్గీయుల మీద చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగి విషయం చెప్పారు. షణ్ముగనాథన్ మాట్లాడుతూ బుధవారం మద్నాహ్నం తాను చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి వెళ్లానని చెప్పారు.

అక్కడ సమావేశం పూర్తి అయిన తరువాత అందర్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో లగ్జరీ రిసార్ట్ దగ్గరకు తీసుకు వెళ్లారని అన్నారు. అక్కడ రాత్రి అందరికి విందు ఏర్పాటు చేశారని, అయితే తాను మధుమేహ వ్యాదితో బాధపడుతున్నందుకు అక్కడ జరిగే విందుకు వెళ్లకుండా గదిలోనే ఉండిపోయానని చెప్పారు.

Srivaikundam MLA Shanmuganathan has petitoned the police to rescue the AIADMK MLAs who are in captive of Sasikala supporters

<strong>చలో చెన్నై: పన్నీర్ ఇంటి దగ్గర క్యూ, ఏకమైన అన్నాడీఎంకే సీనియర్లు</strong>చలో చెన్నై: పన్నీర్ ఇంటి దగ్గర క్యూ, ఏకమైన అన్నాడీఎంకే సీనియర్లు

అనంతరం ఎవర్వూ లేని సమయంలో తాను బాత్రూం కిటికీ నుంచి తప్పించుకుని సమీపంలోని రోడ్డు దగ్గరకు చేరుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆర్టీసీ బస్సులో చెన్నై చేరుకున్నానని వివరించారు. తనతో పాటు తీసుకు వెళ్లిన ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు రిసార్ట్ లోనే ఉన్నారని ఆయన ఆరోపించారు.

తానతో పాటు చాల మంది శాసన సభ్యులు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని, అయితే శశికళ వర్గీయులు వారిని నిర్బంధించారని అన్నాడీఎంకే ఎమ్మెల్యే షణ్మగనాథన్ మీడియాకు చెప్పారు. పోలీసులు ఆయన ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
AIADMK MLA AShanmuganathan told those in charge of getting MLAs to board the bus to a luxury resort that he was feeling giddy and wanted to take medicines. A diabetic, this former minister did go out for some time and returned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X