వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!

|
Google Oneindia TeluguNews

చెన్నై: కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని హైటెక్ వ్యభిచారం చెయ్యాలని ఒత్తిడి చేశారని నమోదైన కేసులో అరెస్టు అయిన లేడీ ప్రొఫెసర్ నిర్మలా దేవికి తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. గతంలో నిర్మలా దేవికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేసిన కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. నిర్మలా దేవి ఎక్కడ ఉన్నా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ప్రొఫెసర్ నిర్మలా దేవిని అరెస్టు చెయ్యడానికి సిద్దం అయ్యారు.

లవర్స్ షికార్లు, ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ చేయించిన ప్రియుడు, వీడియోలు, గర్భవతి !లవర్స్ షికార్లు, ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ చేయించిన ప్రియుడు, వీడియోలు, గర్భవతి !

 కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు!

కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు!

తమిళనాడులోని అరుప్పు కోటై కాలేజ్ లో ప్రొఫెసర్ గా పని చేసిన నిర్మలా దేవి డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పింది. మదురై కామరాజర్ యూనివర్శిటీలోని సీనియర్ అధికారులకు లైంగిక కోరికలు తీరిస్తే పరీక్షల్లో మీకు మంచి మార్కులు వేస్తారని, మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తారని, ఈ విషయం బయటకు రాకుండా నేను చూసుకుంటానని అందమైన డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు ప్రొఫెసర్ నిర్మలా దేవి వలవేసింది.

 అడ్డంగా బుక్కైన నిర్మల

అడ్డంగా బుక్కైన నిర్మల

మదురై కామారాజర్ యూనివర్శిటి అధికారులకు లైంగిక వాంచ తీర్చాలని నిర్మలా దేవి ఫోన్ చేసి రెచ్చగొట్టిన సమయంలోకొందరు కాలేజ్ అమ్మాయిలు మొబైల్ లో రికార్డు చేశారు. ఆ ఆడియో బయటకు రావడంతో నిర్మలా దేవి అడ్డంగా బుక్కైంది. గత సంవత్సరం నిర్మలా దేవిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. నిర్మలా దేవితో పాటు మదురై కామరాజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మురుగన్, పీహెచ్ డీ విద్యార్థిని సైతం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

 18 నెలలకు బెయిల్

18 నెలలకు బెయిల్

నిర్మలా దేవి నోరు విప్పకుండా చేయడం లక్షంగా అనేక మంది పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. చివరికి ఏడాదిన్నర కాలం జైలు జీవితం గడిపిన నిర్మలా దేవి బెయిల్ మీద బయటకు వచ్చింది. నిర్మలా దేవికి షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది. పోలీసుల విచారణకు సహకరించాలని, కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుకావాలని, దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు షరతులు పెట్టింది

బయటకు గెంటేసిన ఫ్యామిలీ

బయటకు గెంటేసిన ఫ్యామిలీ

బెయిల్ పై బయటకు వచ్చిన నిర్మలా దేవిని ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు నిర్మలా దేవిని చీదరించుకున్నారు. విదిలేని పరిస్థితిలో నిర్మలా దేవి స్నేహితురాలి ఇంట్లో ఉంటోంది. భర్త, కుమారుడు, కుటుంబ సభ్యులు వెలివేయడంతో మానసిక క్షోభకు గురైన నిర్మలా దేవి విచిత్రంగా ప్రవర్తిస్తోంది.

కొత్త నాటకాలు

కొత్త నాటకాలు

శ్రీ విళ్లిపుత్తూరు మహిళా కోర్టులో విచారణకు హాజరౌతున్న నిర్మలా దేవి అందర్నీ హడలెత్తించే రీతిలో విచిత్రంగా ప్రవర్తిస్తోంది. తలకు గుండు కొట్టుకుని కోర్టుకు వస్తున్న నిర్మలా దేవి చేష్టలు చూసి కొందరు అయ్యో పాపం అంటుంటే మరి కొందరు కేసు నుంచి తప్పించుకోవడానికి ఈమె కొత్త నాటకాలు అడుతోందని విమర్శిస్తున్నారు. ఇటీవల కోర్టు విచారణకు హాజరైన నిర్మలా దేవి న్యాయమూర్తి సమక్షంలో కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

 ఆడియో కలకలం

ఆడియో కలకలం

నిర్మలా దేవి వేరే వ్యక్తితో రాసలీలల గురించి మాట్లాడుతున్న ఆడియో ఒకటి ఇటీవల విడుదల కావడంతో వైరల్ అయ్యింది. మొబైల్ లో నిర్మలా దేవి, మరో వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడుకున్న ఆడియో విడుదల కావడం కలకలం రేపింది. అయితే ఆ ఆడియో తనది కాదంటూ నిర్మలా దేవి బహిరంగంగా చెప్పారు. విద్యార్థులకు సెక్స్ పాఠాలు చెప్పిన నిర్మలా దేవి కామంతో వేరే వ్యక్తితో ఇలా మాట్లాడిందని పలువురు ఆరోపించారు.

కోర్టు విచారణకు డుమ్మా

కోర్టు విచారణకు డుమ్మా

నిర్మలా దేవి కోర్టు విచారణకు సక్రమంగా హాజరుకాకపోవడంతో శ్రీవిళ్లిపుత్తూరు మహిళా కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులతో బెయిల్ మంజూరు చేస్తే ఇష్టం వచ్చినట్లు ప్రవర్థిస్తావా అంటు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు విచారణకు వరుసగా డుమ్మా కోట్టిన నిర్మలా దేవికి మంజూరు చేసిన బెయిల్ ను కోర్టు రద్దు చేసింది. పిటీ వారెంట్ జారీ చేసిన న్యాయమూర్తి వెంటనే నిర్మలా దేవిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద మరోసారి నిర్మలా దేవి వార్తలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Srivilliputhur mahila court ordered arrest warrant against professor Nirmala Devi. Someone is threatening me.. I'm afraid" controversy audio over professor Nirmala Devi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X