వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనం అతిచేయబట్టే ఇదంతా! : షారుక్ పై కమల్ సంచలన కామెంట్స్

|
Google Oneindia TeluguNews

చెన్నై: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ కు అమెరికాలో ఎదురైన అవమానం పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు అగ్రనటుడు కమల్ హాసన్. ఇందులో అంతగా ఆవేశపడాల్సిన విషయమేమి లేదని, అమెరికా అధికారులు తమ బాధ్యత తాము నిర్వర్తించారని అన్నారు కమల్.

'మనం దీనిపై అతిగా స్పందిస్తున్నాం కాబట్టే.. విషయ తీవ్రత పెరుగుతుందన్న' తరహాలో వ్యాఖ్యలు చేశారు కమల్. ఇమ్మిగ్రేషన్ అధికారులు భద్రతా కారణాల రీత్యా..! షారుక్ ను ఎయిర్ పోర్టులో ఆపేయడం చాలా సాధారణ విషయమని చెప్పుకొచ్చిన కమల్.. 'ఈ ఖాన్ షారుక్ ఖాన్ కావడం వల్లే మనమంతా ఇంతలా స్పందిస్తున్నామని' అన్నారు.

అభిమానుల ఎందుకు ఆవేశపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్న ఆయన.. కొంతమంది ప్రత్యేక వ్యక్తుల కోసం అధికారులు తమ నిబంధనలను విస్మరించలేరని పేర్కొన్నారు. 'అభిమానుల్లాగా షారుక్ ఆలోచించి ఉండడని, తాను షారుక్ ఖాన్ కాబట్టి ప్రత్యేక గౌరవం దక్కాలని అతనెప్పుడూ చెప్పలేదని' అన్నారు కమల్.

SRK’s detention: Kamal Haasan says US authorities simply following rules

షారుక్ పట్ల అక్కడి అధికారులు వ్యవహరించిన అభిమానులను గాయపరిచి ఉండవచ్చునని.. అయితే అమెరికా దేశమే గాయపడిన సందర్బంలో ఉందని.. అందుకే భద్రతా విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్నారు కమల్. ఇలాంటి అనుభవాలు తనకూ ఎదురయ్యాయని చెప్పుకొచ్చిన కమల్.. తాను విమానం మిస్సయ్యాయని, ఆ సమయంలో తనకెవరూ క్షమాపణలు చెప్పలేదని అన్నారు.

చివరగా.. ఖాన్ పేరుతో ఉన్న అందరి పట్ల అమెరికా ఈ తీరులో వ్యవహరించడం సరికాదన్నారు కమల్. అందరూ ఖాన్ లను నిందితుల తరహాలో చూడరాదని, ఖాన్ ల పట్ల దయాగుణంతో వ్యవహరించాలని హితవు పలికారు.

English summary
Shah Rukh Khan’s detention at the Los Angeles airport may have outraged many in India but popular actor Kamal Haasan thinks the US authorities were following rules and were correct in not giving the Bollywood star special treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X