వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్ఎస్సీ పరీక్ష పేపర్ లీక్: సీబీఐ దర్యాఫ్తుకు ఓకే, మార్చి 12కు సుప్రీం విచారణ వాయిదా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పేపర్ లీకేజీపై సీబీఐతో దర్యాఫ్తు చేయించేందుకు ఎస్సెస్సీ చైర్మన్ ఆషిమ్ ఖురానా అంగీకరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

గతనెల 17 నుంచి 22 వరకు ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ (టైర్ 2) పరీక్షలను నిర్వహించారు. కానీ 21వ తేదీ జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. పేపర్‌ లీక్‌ కావడంతోనే పరీక్ష వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి.

SSC exam paper leak: Govt orders CBI probe; SC to hear plea on March 12

దీంతో అభ్యర్థులు ఢిల్లీలో కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. వారికి అన్నాహజారే ఆదివారం మద్దతు తెలిపారు. ఈ వివాదంపై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు.

ఎస్ఎస్సీ పేపర్‌ లీకేజ్‌పై సీబీఐ దర్యాప్తు చేయించాల్సిందిగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలతో పాటు అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ దర్యాప్తు చేయించేందుకు ఎస్ఎస్సీ నిర్ణయించింది.

దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. మార్చి 12వ తేదీన ఈ కేసును విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం సోమవారం చెప్పింది.

English summary
The government on Monday agreed to a CBI inquiry into the alleged SSC question paper leak, irregularities and mass cheating of the examination held between February 17 to February 21, ANI reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X