బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

SSR Case: సుప్రీం కోర్టులో లాయర్ కు షాక్, ఇలాంటివి ప్రోత్సహించం, హైకోర్టుకు పోవాలి, సీబీఐ రిపోర్టు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ ముంబాయి: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కొన్ని నెలలు దాటిపోయినా సీబీఐ అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించారని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో దాఖలు అయిన పిటిషన్ విచారణ ముగిసిపోయింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు సీబీఐకి అప్పగించి ఐదు నెలలు కావస్తోంది. ఇంత వరకు సీబీఐ అధికారులు ఈ కేసును ఎంత వరకు విచారణ చేశారు ?, సీబీఐ విచారణ దర్యాప్తులో ఇంతవరకు తేలిన విషయాలు ఏమిటి ? సీబీఐ ఏం చేసింది ?, ఇక ముందు ఏం చేస్తోంది ? అందరికీ తెలియాలి అంటూ ఓ న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఇంకా ఎంతకాలం సుశాంత్ సింగ్ విచారణ చేస్తుందో అర్థం కావడం లేదని న్యాయవాది వేసిన పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లు మేము ప్రోత్సహించం, మీరు హైకోర్టుకు పోవాలి అంటూ సుప్రీం కోర్టు లాయర్ కు సూచించింది.

Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!

బాలీవుడ్ కు షాక్

బాలీవుడ్ కు షాక్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ 2020 జూన్ 14వ తేదీన ముంబాయిలోని బాంద్రాలోని ఆయన ఇంటిలో అనుమానాస్పదస్థితిలో మరణించాడు. సుశాంత్ సింగ్ మరణించి కొన్ని నెలలు దాటిపోయింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో ముంబాయి పోలీసులు చెప్పారు. బాలీవుడ్ హీరోగా అంచలంచెలు ఎదుగుతున్న యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని ముంబాయి పోలీసులు చెప్పడంతో కలకలం రేపడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

హీరో కేసులో సీబీఐ ఎంట్రీతో !

హీరో కేసులో సీబీఐ ఎంట్రీతో !


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసును ఆగస్టు 19వ తేదీ సీబీఐకి అప్పగిస్తు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి సీబీఐ అధికారులు సుశాంత్ సింగ్ కేసును విచారణ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కేసు విచారణను సీబీఐ అధికారులు ఆలస్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు

సుప్రీం కోర్టుకు పునిత్ ధండా

సుప్రీం కోర్టుకు పునిత్ ధండా

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR)కేసు సీబీఐకి అప్పగించి మూడు నెలల పూర్తి అయిపోయింది, ఇంత వరకు ఈ కేసులో సీబీఐ అధికారులు ఏం చేశారో తెలీదు, ఇక ముందు ఏం చేస్తారో కూడా స్పష్టతలేదు, త్వరగా ఈ కేసు విచారణ పూర్తి చేసి ఎఫ్ఐఆర్ తో పాటు సంపూర్ణ నివేదిక కోర్టులో సమర్పించాలని సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యాలని ప్రముఖ న్యాయవాది పునీత్ ధండా గత ఏడాది డిసెంబర్ నెలలో సుప్రీం కోర్టుకు మనవి చేస్తూ పిల్ (PIL) దాఖలు చేశారు.

సుశాంత్ దెబ్బతో డ్రగ్స్ దందా హడల్

సుశాంత్ దెబ్బతో డ్రగ్స్ దందా హడల్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ జూన్ 14వ తేదీన ముంబాయిలోని బాంద్రాలోని ఆయన ఇంటిలో అనుమానాస్పదస్థితిలో మరణించారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ ను కుదిపేసింది. ఇదే సమయంలో బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు, ముంబాయి డ్రగ్స్ మాఫియా తెరమీదకు వచ్చింది.

బాలీవుడ్ ను ఓ రౌండ్ తిప్పేసింది

బాలీవుడ్ ను ఓ రౌండ్ తిప్పేసింది

ముంబాయి డ్రగ్స్ కేసులో ఇంత వరకు దీపికా పదుకొనే, సారా ఆలీఖాన్ ,కరణ్ జోహార్ తో పాటు అనేక మంది సెలబ్రిటీలను ఎన్ సీబీ అధికారులు విచారణ చెయ్యడం కలకలం రేపింది. బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ లోని కొందరు సెలబ్రీల విషయంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.

Recommended Video

Maharashtra Cabinet clears draft bill for proposed 'Shakti Act'
సుప్రీం కోర్టులో లాయర్ కు షాక్

సుప్రీం కోర్టులో లాయర్ కు షాక్

సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ అధికారులు సక్రమంగా విచారణ చెయ్యడం లేదని ఆరోపిస్తూ న్యాయవాది పునీత్ ధండా దాఖలు చేసిన పిటిషన్ విచారణ పూర్తి అయ్యింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జప్టిస్ ఎస్.ఏ. బోబ్డే, జస్టిస్ ఎఎస్, బోపణ్ణ, జస్టిస్ వి. రామసుబ్రమణియన్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ పిటిషన్ విచారణ చేసింది. సీబీఐ అధికారుల మీద ఆరోపణలు చేస్తూ మీరు వేసిన ఇలాంటి పిటిషన్ లను మేము ప్రోత్సహించలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు హైకోర్టుకు పోవాలని, అవసరంగా ఇలాంటి పిటిషన్లు దాఖలు చెయ్యకూడదని సుప్రీం కోర్టు న్యాయవాది పునీత్ ధండాకు సూచించింది. పునీత్ ధండా వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

English summary
SSR: Sushant Singh Death case, Supreme Court dismisses plea seeking direction to CBI to submit status report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X