వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకులో రూ. కోటి లోన్ ఇవ్వలేదని మేనేజర్, ఆడిటర్ ను పొడిచిపారేసిన వ్యాపారి, రివాల్వర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బ్యాంకులో రూ. 1 కోటి లోన్ (రుణం) ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని విసిగిపోయిన వ్యాపారి కత్తి తీసుకుని బ్యాంకు మేనేజర్, ఆడిటర్ ను పొడిచి హత్యాయత్నం చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు( కోవై)లో కలకలం రేపింది. వ్యాపారి చేతిలో కత్తిపోట్లకు గురైన బ్యాంకు మేనేజర్, ఆడిటర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బ్యాంకు మేనేజర్, ఆడిటర్ మీద హత్యాయత్నం చేసిన వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బ్యాంకులో అందరూ చూస్తున్న సమయంలో కత్తి, తుపాకితో వ్యాపారి విరుచుకుపడటంతో బ్యాంకు సిబ్బంది హడలిపోయారు.

ఎన్ కౌంటర్ భయం? కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, కోర్టులో లొంగిపోయిన గ్యాంగ్ లీడర్, వీడియోలు!ఎన్ కౌంటర్ భయం? కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, కోర్టులో లొంగిపోయిన గ్యాంగ్ లీడర్, వీడియోలు!

వ్యాపారం కోసం ఆశతో !

వ్యాపారం కోసం ఆశతో !

కోవైలోని సోమయ్యపాళ్యం పద్మావతి నగర్ లో వెట్రివేల్ (40) అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. కోవైలోని బండిపురంలో వెట్రివేల్ బైక్ ల విడిభాగాలు విక్రయించే దుకాణం నడుపుతున్నాడు. వ్యాపారం అభివృద్ది చేసుకోవడానికి వెట్రివేల్ బ్యాంకులో రుణం తీసుకోవాలని నిర్ణయించాడు.

 బ్యాంకులో రూ. కోటి లోన్ !

బ్యాంకులో రూ. కోటి లోన్ !

కోవైలోని తిరుచ్చి రోడ్డులోని కెనరా బ్యాంకులో రూ. కోటి రుణం తీసుకోవాలని వెట్రివేల్ నిర్ణయించాడు. కోవైలోని స్నేహితుడు, ఆడిటర్ గుణబాలన్ తాను బ్యాంకులో రుణం తీసిస్తానని వెట్రివేల్ కు మాట ఇచ్చాడు. బ్యాంకులో రుణం మంజూరు అయిన తరువాత తన వ్యాపారం మరింత అభివృద్ది చెయ్యాలని వెట్రివేల్ చాల రోజుల నుంచి వేచి చూశాడు.

వ్యాపారికి ఎక్కడో కాలిపోయింది !

వ్యాపారికి ఎక్కడో కాలిపోయింది !

బ్యాంకులో రుణం తీసుకోవడానికి వెట్రివేల్ ఆస్తుల దస్తావేజులు ఇచ్చాడు. బ్యాంకులో ఎంత కాలం అయినా రుణం మంజూరు కాకపోవడంతో వెట్రివేల్ కు ఎక్కడో కాలిపోయింది. స్నేహితుడైన ఆడిటర్ గుణపాలన్ ను వెంటపెట్టుకున్న వెట్రివేల్ నేరుగా కెనరా బ్యాంకులోకి వెళ్లాడు.

 చావు కబురు చల్లగా చెప్పిన మేనేజర్

చావు కబురు చల్లగా చెప్పిన మేనేజర్

బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్ ను కలిసిన వెట్రివేల్ తన లోన్ విషయం ఏమైయ్యింది ? అని అడిగాడు. మీ లోన్ ధరఖాస్తు రిజక్ట్ అయ్యిందని, మీకు లోన్ ఇవ్వడం కుదరదని బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ చెప్పాడు. ఇంత కాలం తనను బ్యాంకు చట్టూ తిప్పించుకుని ఇప్పుడు చావు కబురు చల్లాగా చెబుతావా అంటూ వెట్రివేల్ రెచ్చిపోయాడు.

 రివాల్వర్ తో కాల్చిపారేస్తా !

రివాల్వర్ తో కాల్చిపారేస్తా !

బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్ చెప్పిన మాటలకు సహనం కోల్పోయిన వెట్రివేల్ జోబులో ఉన్న తుపాకి తీసుకుని మిమ్మల్ని ఇక్కడే కాల్చిపారేస్తా అంటూ రెచ్చిపోయాడు. తరువాత జోబులో ఉన్న కత్తి తీసుకుని బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, స్నేహితుడైన ఆడిటర్ గుణబాలన్ మీద దాడి చేశాడు. బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, ఆడిటర్ గుణబాలన్ గట్టిగా కేకలు వెయ్యడంతో విషయం గుర్తించిన బ్యాంకు సిబ్బంది మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్లి వెట్రివేల్ ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 అయ్యో పాపం వ్యాపారి !

అయ్యో పాపం వ్యాపారి !

బ్యాంకు మేనేజర్, ఆడిటర్ మీద వెట్రివేల్ కత్తితో దాడి చేసిన సమయంలో అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వెట్రివేల్ ను అరెస్టు చేశామని, అతని దగ్గర బొమ్మ తుపాకి, కత్తిని స్వాధీనం చేసుకున్నామని, బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, ఆడిటర్ గుణబాలన్ ను ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Stabbing canara Bank manager and staffs in Coimbatore in Tamil Nadu and one arrested under 3 sections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X