వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్లుండి లోపే ఫైనల్? అన్నాడీఎంకే వర్గాల విలీనం సాధ్యమేనా? మోడీ హెచ్చరికలు పనిచేస్తాయా?

అన్నాడీఎంకే విలీనం కథ ముగింపు దశకు చేరుకున్నది.సీఎం ఎడపాడి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాలు ఏకం కావడానికి మంగళవారం లోగా మూహుర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఒకటి రెండు రోజుల్లో మంచివార్త

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే విలీనం కథ ముగింపు దశకు చేరుకున్నది. సీఎం ఎడపాడి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాలు ఏకం కావడానికి మంగళవారం లోగా మూహుర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మంచివార్త వింటారని శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం అన్నారు.

అలాగే సీఎం ఎడపాడి వర్గ అధికార ప్రతినిధి ధీరన్‌ సైతం అదే విషయాన్ని మీడియాకు తెలిపారు. సీఎం ఎడపాడి పళనిసామి, మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌లతో మూడు ముక్కలు, ఆరు చెక్కలుగా మారిన అన్నాడీఎంకే వర్గ విభేదాల కారణంగా ప్రజల్లో పలుకుబడి, ప్రతిష్టను కోల్పోయింది. ఎంజీఆర్‌ స్థాపించిన పార్టీ, రెండాకుల చిహ్నం ఎన్నికల కమిషన్‌ చేతుల్లో చిక్కిపోయింది.

విలీనమైతేనే కేంద్రప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుందని ప్రధాని మోదీ సైతం అల్టిమేటం ఇచ్చారు. పార్టీ లేదు, చిహ్నం లేదు, ప్రధాని తోడ్పాటు లేదు, పార్టీపై ప్రజల్లో విలువ కూడా అడుగంటిపోతున్న తరుణంలో విలీనం కావడం మినహా గత్యంతరం లేదన్న వాస్తవం ఇరువర్గాలు గ్రహించాయి. విలీనం గురించి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిన అన్నాడీఎంకే డిప్యూటీ కార్యదర్శి టీటీవీ దినకరన్ మండిపడ్డారు. పార్టీ క్రమశిక్షణ పాటించకుంటే మరో నేతను సీఎంగా తీసుకు వస్తామని సీఎం పళనిసామిని దినకరన్ హెచ్చరించారు.

అన్నాడీఎంకే విలీనానికి దినకరన్ అడ్డు నిలుస్తారా?

అన్నాడీఎంకే విలీనానికి దినకరన్ అడ్డు నిలుస్తారా?

ఇదిలా ఉంటే పదవులపై పట్టుపట్టకుండా విలీనం కావాలని అన్నాడీఎంకేలోని ఇరువర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు వంటి ఆదేశాలు జారీచేశారు. ఆలస్యమైతే పార్టీ డిప్యూటీ కార్యదర్శి దినకరన్‌ వల్ల కొత్త సమస్యలు తలెత్తగలవని ఆందోళన చెందిన ఎడపాడి, పన్నీర్‌ వర్గాలు ఒకేసారి విలీనానికి సిద్ధం అయ్యాయి. శుక్ర, శనివారాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశమయ్యాయి. పన్నీర్‌ వర్గం పెట్టిన షరతులను 90 శాతం వరకు ఎడపాడి పళనిసామి వర్గం ఆమోదించింది. చర్చలు కొలిక్కివచ్చి ఎడపాడి, పన్నీర్‌ వర్గాలు అమ్మ సమాధి వద్ద ఏకమై సాయంత్రం ఏడు గంటల తరువాత అధికారికంగా ప్రకటిస్తారని అందరూ ఆశించారు. అయితే అందరి ఆశలను తల్లకిందులు చేస్తూ రాత్రి 10 గంటల సమయంలో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

రాజీనామా కోసం పన్నీర్‌పై ఒత్తిడి ఇలా

రాజీనామా కోసం పన్నీర్‌పై ఒత్తిడి ఇలా

‘విలీనం వల్ల అన్ని విధాలా మనకు న్యాయం జరుగుతుంది, ఇందుకు నేను హామీ' అంటూ పన్నీర్‌సెల్వం తన వర్గానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు కాని మాజీ మంత్రులు నత్తం విశ్వనాథన్, కేపీ మునుస్వామి మంత్రి పదవులు కావాలని కోరారు. ఉప ఎన్నికల ద్వారా తమ గెలుపు కోసం రాజీనామా చేసేందుకు కొందరు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కూడా వారు పన్నీర్‌పై ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా సీనియర్‌ నేతలు పాండియరాజన్, కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, ఎంపీ మైత్రేయన్, ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంకా అనేక డిమాండ్లు పన్నీర్‌ ముందు పెట్టడంతో ఆవన్నీ ఇప్పుడు కాదని నిరాకరించారు.

వేర్వేరుగా ఇరు గ్రూపులు చర్చలు

వేర్వేరుగా ఇరు గ్రూపులు చర్చలు

చర్చల్లో పాల్గొన్న నేతలంతా పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకుని రావడంతో వారికి నచ్చజెప్పడం పన్నీర్‌ వల్లకాక పోవడం, నేతల మొండిపట్టుతో విలీనంలో ప్రతిష్టంభన ఏర్పడింది. కొందరు నేతలు వెళ్లిపోయిన అనంతరం కూడా శనివారం తెల్ల వారుజాము 3 గంటల వరకు పన్నీర్‌సెల్వం నేతలో చర్చలు జరిపారు. శనివారం సైతం ఎడపాడి, పన్నీర్‌ వర్గాలు వేర్వేరుగా చర్చల్లో మునిగితేలాయి. ఒకటి రెండు రోజుల్లో ఒక మంచి వార్త వింటారని, విలీనం ఖాయమని పన్నీర్‌సెల్వం, ఎడపాడి వర్గ అధికార ప్రతినిధి ధీరన్‌ శనివారం మీడియాకు చెప్పారు. శుక్రవారం నాటి చర్చలకు కొనసాగింపుగా శనివారం సైతం ఇరువర్గాలు సమావేశంకాగా, ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈనెల 21వ తేదీన ఇరువర్గాలు విలీనంపై ప్రకటన చేస్తారని అంచనా.

లిఖిత పూర్వకంగా హామీ కావాలని పళనిసామి

లిఖిత పూర్వకంగా హామీ కావాలని పళనిసామి

చర్చల ప్రారంభ దశలోనే విలీనం ద్వారా తమకు పార్టీ, ప్రభుత్వంలో పదవులు కావాలని పన్నీర్‌ వర్గం పట్టుబట్టడం ప్రారంభించారు. పన్నీర్‌సెల్వంకు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ప్రజాపనులు, హోంశాఖ శాఖలతో డిప్యూటీ సీఎం పదవి, చెమ్మలై, పాండియరాజన్‌లకు మంత్రి పదవులు ఖాయమని సీఎం ఎడపాడి వర్గం సమాచారం ఇచ్చింది. పన్నీర్‌ కోరుతున్న ఆర్థిక మంత్రిత్వ శాఖను ఇచ్చేందుకు ఎడపాడి వర్గం నిరాకరించింది. ఎమ్మెల్యేలు కాని వారు సైతం మంత్రి పదవుల కోసం పట్టుపట్టారు. తమ వర్గానికి కేటాయించే పదవులు ఏమిటో ఇప్పుడే లిఖితపూర్వకంగా తెలియజేయాలని పన్నీర్‌ వర్గ నేతలు ఎడపాడి వర్గాన్ని పట్టుబట్టారు.

English summary
Six months after former chief minister O Panneerselvam revolted and attempted to split the AIADMK, a merger seems close. At the end of many marathon meetings and tortuous negotiations over the past few months, the factions led by OPS and Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami seem to have hammered out the formula for re-unification. An announcement is likely on Monday, sources on both sides said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X