వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలా అయితే స్టాలిన్ సిఎం: పన్నీర్‌కు మద్దతు వెనక వ్యూహం అదే..

పన్నీర్ సెల్వంకు స్టాలిన్ మద్దతు ప్రకటించడం వెనక దీర్షకాలిక వ్యూహం ఉందా.. పరిస్థితులను గమనిస్తుంటే అలాగే అనిపిస్తోంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళపై తిరుగుబాటు ప్రకటించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు డిఎంకె నేత స్టాలిన్ మద్దతు ఇవ్వడం వెనక దీర్ఘకాలిక వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వడం ద్వారా తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆయన మార్గం వేసుకోవాలని చూసినట్లు తెలుస్తోంది.

పన్నీర్ సెల్వంకు శాసనసభలో తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్టాలిన్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావుతో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం డిఎంకెకు 89 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ పార్టీకి 8 స్థానాలున్న కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంది. మరో 22 మంది ఎమ్మెల్యేలుంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను డీఎంకే దాటే అవకాశం ఉంది.

అయితే, ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని స్టాలిన్ అనుకోవడం లేదని చెబుతున్నారు. అన్నాడియంకెను తుత్తునియలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవి దానంతటది తన దగ్గరకు వచ్చే వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నట్లు చెబుతున్నారు.

 జయలలిత కాలంలో ఇలా ఉండేది...

జయలలిత కాలంలో ఇలా ఉండేది...

జయలలిత జీవించి ఉన్నంత వరకు అన్నాడియంకె నాయకులు గానీ శాసనసభ్యులు గానీ డిఎంకె నేతలతో, ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి కూడా గజగజ వణికేవారు. ప్రత్యేక వేడుకల్లో ఇరు పార్టీలవారు ఉన్నా కూడా మొహం తిప్పుకునే వెళ్లేవారు. మంత్రులు కూడా డిఎంకె నేతలతో మాట్లాడడానికి ధైర్యం చేసేవారు కాదు. జయలలిత డిఎంకెను ప్రత్యర్థిగా కాకుండా శత్రువు మాదిరిగా చూడడమే దానికి కారణం. డిఎంకె నేతలతో మాట్లాడితే జయలలిత వేటు వేసేవారు. జయలలిత మరణించిన తర్వాత పరిస్థితి మారిపోయింది.

 అందుకే నవ్వుపై వివాదం...

అందుకే నవ్వుపై వివాదం...

ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం డిఎంకె నేత స్టాలిన్‌తో నవ్వుతూ మాట్లాడడం వివాదంగా మారింది. జయలలిత వైఖరి కారణంగా అలా నవ్వుతూ మాట్లాడడం కూడా వివాదంగా మారింది. దాంతో ఆగకుండా పన్నీరు సెల్వంకు స్టాలిన్ మద్దతు ఇచ్చేంత వరకు పరిస్థితి వెళ్లింది. జయలలిత మరణం తర్వాత అన్నాడియంకెలో రగులుతున్న సంక్షోభాన్ని స్టాలిన్ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 ఆ కారణంగానే స్టాలిన్ ఇలా...

ఆ కారణంగానే స్టాలిన్ ఇలా...

అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి శశికళ తగినంత మంది శాసనసభ్యులతో ప్రభు్తవాన్ని ఏర్పాటు చేస్తే అది ముందు ముందు డిఎంకెకు సవాల్ కావచ్చునని స్టాలిన్ భావించారని చెప్పవచ్చు. జయలలిత వద్ద దాదాపుగా శిక్షణ పొందిన శశికళ పార్టీ నిర్వహణపైనా, ప్రభుత్వ పాలనపైనా అవగాహన పెంచుకున్నారు. ఆమె ముఖ్యమంత్రి అయితే తాము పుంజుకోవడానికి అవకాశం లేకుండా జయలలిత మాదిరిగానే వ్యవహరించి తమకు అధికారాన్ని దూరం చేసే అవకాశం ఉండవచ్చునని స్టాలిన్ భావించినట్లు చెబుతారు. అన్నాడియంకె ఉనికి బలంగా ఉండే అవకాశమే ఉంటుంది. అన్నాడియంకెను ఛిన్నాభిన్నం చేయడం సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 పన్నీర్ పరిస్థితి ఇదీ...

పన్నీర్ పరిస్థితి ఇదీ...

తమ పార్టీకి గట్టి ప్రత్యర్థి లేకుండా చూసుకోవడానికే స్టాలిన్ శశికళను అడ్డుకోవడానికి తన వంతు సహాయాన్ని పన్నీర్ సెల్వానికి అందించడానికి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు పన్నీర్ సెల్వంకు తగినంత మంది శాసనసభ్యుల బలం లేదని తేలిపోయింది. ఆయన వెంట ప్రస్తుతం కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. దేవర్ వర్గానికి చెందిన 30 మంది ఆయనకు మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అన్నాడియంకె నుంచి మరింత మంది ఎమ్మెల్యేలు వచ్చినా ఆ బలం సరిపోదు.

 ప్రత్యర్థి లేకుండా చూసుకోవడానికే స్టాలిన్...

ప్రత్యర్థి లేకుండా చూసుకోవడానికే స్టాలిన్...

పన్నీర్ సెల్వంకు తగినంత బలం లేకపోవడాన్ని స్టాలిన్ తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. డిఎంకె మద్దతు ఇస్తే పన్నీర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దాంతో శశికళకు అడ్డుకట్ట వేయడానికి వీలవుతుంది. అధికారం లేని శశికళ నుంచి శాసనసభ్యులు, నాయకులు దూరంగా జరుగుతారు. క్రమంగా ఆమె ఒంటరి అయిపోతారు. కొంత కాలం తర్వాత పన్నీర్‌కు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది. మధ్యంతర ఎన్నికలు వస్తే ఢీలా పడిపోయిన అన్నాడియంకెను మట్టికరిపించడం స్టాలిన్‌కు కొట్టిన పిండి అవుతుంది.

 ఇలా జరిగే అవకాశం కూడా ఉంది...

ఇలా జరిగే అవకాశం కూడా ఉంది...

ఎన్నికలు రాకుండా నిరోధించే అవకాశం కూడా ఉంది. కొంత కాలం తర్వాత పన్నీర్ సెల్వం తనకు మద్దతుగా నిలిచారనే కృతజ్ఞతతో స్టాలిన్ ముఖ్యమంత్రి కావడానికి సహకరించవచ్చు. ఇవన్నీ జరగాలంటే ముందు శశికళకు చెక్ పెట్టాలనేది స్టాలిన్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆయన దూకుడుగానే వ్యవహరిస్తున్నారు.

English summary
In a strategy to make his party strong and become future CM stalin is supporting Panneer Selvam in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X