వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీ, కమల్ రాజకీయ రంగప్రవేశంపై డీఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కొత్త పక్షులు ఎగరాలనుకుంటున్నాయి. ఎంతదూరం ఎగరగలవో చూడాలి’ అంటూ వ్యాఖ్యానించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కొత్త పక్షులు ఎగరాలనుకుంటున్నాయి. అవి ఎంత దూరం ఎగరగలవో చూడాలి' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఈ మేరకు పార్టీ నేతలకు రాసిన లేఖలో స్టాలిన్‌ పేర్కొన్నారు. డీఎంకే మాత్రం చాలా ఎత్తులో ఎగురుతున్న పక్షి అని, అది ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించే ఆలోచిస్తుందని స్టాలిన్ చెప్పుకొచ్చారు.

dmk-stalin

'ప్రజాస్వామ్యం ఆకాశం వంటిది. అది పక్షులన్నింటికీ ఒకేలా ఉంటుంది. ఈ రాజకీయ వాతావరణం గురించి తెలుసుకున్న కొత్త పక్షులు ఇప్పుడు ఎగరాలనుకుంటున్నాయి. చూద్దాం.. అవి ఎంత వరకు ఎగరగలవో..' అని పరోక్షంగా రజనీ, కమల్‌ను ఉద్దేశించి స్టాలిన్ వ్యాఖ్యానించారు.

రజనీకాంత్, కమల్ హాసన్ తమ రాజకీయ ప్రవేశంపై ఈ మధ్యనే వేర్వేరుగా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కమల్ హాసన్ సందర్భం వచ్చినప్పుడల్లా అధికార అన్నాడీఎంకేపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

అటు సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా త్వరలోనే పార్టీని ప్రకటించబోతున్నట్లు తెలిపారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో కమల్‌, రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఆసక్తికరంగా మారింది.

English summary
The DMK today took a veiled dig at popular actors Kamal Haasan and Rajinikanth on their political aspirations, saying “new birds want to fly” and it remained to be seen how much distance they can cover on their strength. In a letter addressed to partymen, DMK working president M K Stalin said while democracy was a “sky” common for all, many birds can hardly make the distance. He branded his DMK as “high-flying” and one that was always “concerned” about the people of the state. “Aware of the political atmosphere, new birds want to fly. Democracy is a sky (common) for all. The political arena is watching how much distance a bird can fly on the strength of its wings,” he said in cryptic remarks apparently aimed at the two actors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X