వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాలిన్ సంచలన నిర్ణయం: ఆయనకు చెక్ పెట్టడానికేనా !

|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎంకే పార్టీ కార్యక్రమాల్లో హంగులు, ఆడంబరాలు, ఆర్బాటాలు చెయ్యడం మానుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ కార్యకర్తలకు సూచించారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్ లకు మంగళం పాడాలని కేడర్ కు పిలుపునిచ్చారు.

తన పర్యటనలు, సభలు, సమావేశాల సందర్బంగా పార్టీ కార్యకర్తలు దారిపోడవునా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చెయ్యరాదని, అందులోనూ తన ఫోటోలు పెద్దపెద్ద సైజలో ముద్రించి ఏర్పాటు చెయ్యరాదని స్టాలిన్ పార్టీ కార్యకర్తలకు మనవి చేశారు.

ఇలా చేస్తే ట్రాఫిక్ కు సైతం అంతరాయం ఏర్పడే విధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చెయ్యరాదని అన్నారు. సభలు జరిగే చోట ఒకటి రెండు ఫ్లెక్సీలు, సభ జరిగే తేదీ, సమయం ఉన్న వివరాలను జనం పోగు అయ్యే చోట పోస్టర్లు వేస్తే సరిపోతుందని స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Stalin urges cadres not to deface walls with posters, banners

డీఎంకే పార్టీ కార్యకర్తలు ఇక ముందు ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసే సమయంలో తన ఫోటోకు బదులుగా పెరియార్, అన్నాదురై, అన్బళగన్, పార్టీ అధ్యక్షుడు కురుణానిధి ఫోటోలు వేస్తేచాలని ఎంకే. స్టాలిన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా ఎక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చెయ్యరాదని ఆయన మనవి చేశారు. అయితే స్టాలిన్ నిర్ణయం వెనుక ఏమైనా కుటుంబ సమస్యలు ఉన్నాయా ?అని డీఎంకే పార్టీలోని పలువురు కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్టాలిన్ సోదరుడు ఎంకే. అళగిరి పుట్టిన రోజు జనవరి 30వ తేది. ఆ రోజు మధురైలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటారు. అయితే అళగిరి పుట్టి రోజుకు ఒక్క రోజు ముందే స్టాలిన్ ఈ స్టేట్ మెంట్ ఇవ్వడంతో డీఎంకే నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు ఈ విషయంపై గుసగుసలాడుతున్నారు.

English summary
MK Stalin said the party would win the support of the people when it shuns indiscriminate use of flex boards and banners. Instead, cadres could hoist as many party flags as possible, he urged. It is a must to avoid erection of banners on roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X