వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకలితో అలమటించే వీడియో..?: బీజేపీ నేతల ట్వీట్, బెంగాల్ పోలీసుల రియాక్షన్.. ఫేక్ అని

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ-బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న సమయంలో కూడా తీరు మారలేదు. అయితే స్థానిక థియేటర్ నటుడు ఓ వీడియో చేశాడు. ఆకలితో అలమటిస్తున్నానని.. ఆదుకోవాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరాడు. అయితే దానిని బీజేపీ నేతలు షేర్ చేయడంతో వివాదం చెలరేగింది

ఆ వీడియోలో నటుడు తమకు ఆహారం అందించాలని సీఎం మమతా బెనర్జీని కోరాడు. లేదంటే చంపేయాలని సూచించాడు. గత రెండురోజల నుంచి తాము ఆహారం తీసుకోలేదని పేర్కొన్నారు. అమ్మ.. మేం మీ పిల్లలం.. తమపై దయచూపాలని కోరారు. తమ సమస్యపై స్పందించాలని ఎంపీ నుష్రత్ జహాన్ పేరు కూడా ప్రస్తావించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. తమకు కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరారు. 57 సెకండ్ల నిడివిగల వీడియోను బెంగాల్ బీజేపీ నేతలు ట్వీట్ చేశారు.

బీజేపీ పోస్ట్ చేయగా.. బెంగాల్ పోలీసులు అదే వ్యక్తికి చెందిన మరో వీడియోను పోస్ట్ చేశారు. తనను కొందరు కలిసి వీడియో చేయాలని కోరితే చేశానని పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై చేయాలని కోరగా.. చేశానని తెలిపారు. ఆ వృద్దుడిని మొబారక్ మొండల్‌గా పోలీసులు గుర్తించారు.

‘Starving man’ in BJP video is a jatra actor putting up an act: Bengal Police

బేగంపూర్ గ్రామానికి చెందిన అతనికి ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు అందుతున్నాయని.. ఎలాంటి ఫిర్యాదు లేదని చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. కానీ బీజేపీ కావాలనే అసత్య ప్రచారం చేయాలని చూసిందని.. పోలీసులు విచారణలో తేలింది. మరీ దీనిపై బీజేపీ స్పందించాల్సి ఉంది.

Recommended Video

Coronavirus : COVID-19 Cases Crossed 1,332 Mark In AP With 73 New Cases

English summary
Bengal Police has said a poor old man appealing to CM Mamata Banerjee in a video shared by BJP is that of a jatra actor and it is a propaganda video
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X