వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైబర్ ఫ్రాడ్: ఎస్బీఎం ముంబై బ్రాంచిలో రూ. 143కోట్లు మాయం, ఇదే మొదటిసారి కాదు!

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ మారిషస్‌(ఎస్‌బీఎం) బ్యాంక్‌లో సైబర్‌ దాడి జరిగింది. అయితే విషయం ఆల్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకులోని పలు ఖాతాల నుంచి దాదాపు రూ.143కోట్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు.

ముంబైలోని నారిమన్‌ పాయింట్‌ బ్రాంచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై బ్యాంకు అధికారులు అక్టోబర్ 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. హ్యాకర్లు బ్యాంక్‌ సర్వర్లను హ్యాక్‌ చేసి బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకున్నారు.

 State Bank of Mauritius Mumbai Branch Loses Rs. 143 Crore To Cyber Fraud

వారి ఖాతాల నుంచి సుమారు రూ.143కోట్లను ఇతర దేశాల్లోని పలు ఖాతాలకు మళ్లించినట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. గత తొమ్మిది నెలల కాలంలో బ్యాంకులపై జరిగిన మూడో సైబర్‌ దాడి కావడం గమనార్హం.

ఫిబ్రవరిలో చెన్నైలోని సిటీ యూనియన్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌పై దుండగులు సైబర్‌దాడికి పాల్పడి రూ.34కోట్లను మళ్లించారు. ఆగస్టు నెలలో పుణెలోని కాస్మోస్‌ బ్యాంక్‌లోనూ ఇలాగే రూ.94కోట్లను దారి మళ్లించారు. ఎస్‌బీఎం బ్యాంక్‌పై సైబర్‌ దాడిలో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలోను పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
The State Bank of Mauritius' (SBM) Mumbai branch has been gypped of nearly Rs. 143 crore after unknown fraudsters hacked into its accounts here, an official said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X