వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ప్రజా తీర్పును గౌరవిస్తాం', 'మాకు గుణపాఠం'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు గుణపాఠం చెప్పాయని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల గురించి పార్టీలో చర్చిస్తామని అన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు.

ప్రజా తీర్పును గౌరవిస్తాం : రాజ్‌నాథ్ సింగ్

Rajnath singh

బీహార్ ప్రజల తీర్పుపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సంగ్ ట్విట్టర్‌లో స్పందించారు. బీహార్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయు నేత నితీశ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అదే విధంగా బీహార్ అభివృద్ధికి ప్రధాని మోడీ అన్ని విధాలా అండగా ఉంటారని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలకు గాను మహాకూటమి 106 స్ధానాల్లో విజయం సాధించి 67 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఎన్డీఏ 29 స్ధానాల్లో విజయం సాధించి 33 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 5 స్ధానాల్లో విజయం సాధించి, 3 చోట్ల ముందంజలో ఉన్నారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ఆరంభంలో ఎన్డీఏ ఆధిక్యం ప్రదర్శించినా, ఆ తర్వాత క్రమేపీ మహాకూటమి పుంజుకొని పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

English summary
This is a state election and not a referendum of govt says minister Prakash Javadekar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X