వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్, ఇరాక్ లో మా మామ ఏమైనా ఉన్నాడా, పెట్రోల్ ఫ్రీగా ఇవ్వాలా ? బీజేపీ ఎమ్మెల్యే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పెట్రోల్, డీజల్ ఉద్దరగా (ఫ్రీ) ఇవ్వడానికి ఇరాన్-ఇరాక్ లో మా మామలు లేరని కార్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సీటీ. రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజల్ మీద పన్ను తగ్గించాల్సింది కేంద్ర ప్రభుత్వం కాదని, రాష్ట్ర ప్రభుత్వాలని సీటీ. రవి అన్నారు. పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోయాయి అంటూ కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేస్తోందని సీటీ. రవి ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన భారత్ బంద్ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి మీడియాతో మాట్లాడారు. ఇరాన్- ఇరాక్ భారత్ కు ఉద్దరగా పెట్రోల్, డీజల్ ఇస్తే తాము కూడా ఫ్రీగా ప్రజలకు ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి అన్నారు.

State govt should reduce the tax on petrol and diesel not central govt says BJP MLA

ఇరాన్- ఇరాక్ లో మా మామలు ఎవ్వరూ లేరని, పెట్రోల్, డీజల్ తక్కువ ధరకు సరఫరా చెయ్యలేమని బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి వ్యంగంగా అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పెట్రోల్ డీజల్ ధరలు పెరిగిన విషయం ఆ పార్టీ నాయకులకు గుర్తు లేదా అని బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి ప్రశ్నించారు.

నీటితో వాహనాలు నడపం సాధ్యం కాదని సీటీ. రవి చెప్పారు. మొదట మీ కుమారుడు, సీఎం కుమారస్వామికి పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించాలని చెప్పిన తరువాత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చెయ్యాలని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడకు బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి సూచించారు.

పెట్రోల్, డీజల్ ధరలు పెరుగదలను బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి సమర్థించుకున్నారు. కేంద్రంలో అధికారానికి దూరం అయ్యి ఏమి చెయ్యాలో తెలీక నీళ్లలో నుంచి బయటపడిన చేప కొట్టుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోందని బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి వ్యంగంగా అన్నారు.

English summary
State government should reduce the tax on petrol and diesel not central government said BJP MLA CT Ravi. He also said Deve Gowda should tell his son (CM Kumaraswamy) to reduce petrol price.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X