వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీ బీహరీ ఆకలితో పడుకోవద్దనేదే మా విధానం: ఎన్డీఏ వెంట ప్రజలు, ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

బీహర్‌లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరుతోందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. బీహర్ యువత, మహిళలు ఎన్డీఏ సుపరిపాలన అందిస్తారనే ధీమాతో ఉన్నారని చెప్పారు. బీహరీల నేత కూడా వెనకబడిన కులానికి చెందినవారు అని, పేదరికం అంటే తెలుసు అని చెప్పారు. అందుకోసమే ప్రతీ ఒక్కరు ఆకలితో పడుకోకూడదనే తమ ప్రభుత్వం భావిస్తోందని మోడీ తెలిపారు. ప్రతీ బీహరీ ఎన్డీఏకు మద్దతుగా ఉంటున్నారని గుర్తుచేశారు.

అంతకుముందు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ, బీహర్ సీఎం నితీశ్ కుమార్‌పై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రజలను పట్టించుకొనిదీ ఎవరూ అని విరుచుకుపడ్డారు. వారే ఇప్పుడు ఓట్లను అడుగుతున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం బీహర్ ఆరారియా ర్యాలీలో ప్రసంగించారు. మోడీ ఓటింగ్ మిషన్, మోడీజీ మీడియా ఉండటంతో వారు భయపడటం లేదన్నారు. ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తోందని ఢంకా బజాయించి మరీ చెప్పారు.

State’s poor know their ‘sevak’ from backward society ensuring that none sleeps hungry

3వ తేదీ (మంగళవారం) రెండో విడత బీహర్ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 94 నియోజకవర్గాలకు సంబంధించి 2.85 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 53 శాతం పోలింగ్ జరిగింది. సీఎం నితీశ్ కుమార్, సుశీల్ కుమార్ మోడీ, తేజస్వి యాదవ్, చిరాగ్ పాశ్వాన్ పోలింగ్ బూత్‌కెళ్లి మరీ ఓటు వేశారు. మూడో విడత ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరగనుంది.

English summary
Prime Minister Narendra Modi on Wednesday said confidence to win the ongoing Bihar Assembly elections. youth and women of bihar see hope in NDA as they prefer good governance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X