• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా టీకా వారంలో రెండు రోజులే- వ్యాక్సిన్ డిమాండ్‌- సాధారణ సేవలూ ముఖ్యమే

|

భారత్‌లో మరికొన్ని రోజుల్లోనే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే మూడు సంస్ధలు భారత్‌లో వ్యాక్సిన్‌ సరఫరా కోసం కేంద్రాన్ని అనుమతి కోరగా.. ఇందులో ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు కేంద్రం ముందుగా అనుమతిచ్చే అవకాశముంది. ఆ తర్వాత ఫైజర్ వ్యాక్సిన్‌తో పాటు భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్ టీకాకూ అనుమతి లభించనుంది. ఈ ముగ్గురూ టీకాను సరఫరా చేసినా భారత్‌లో ప్రస్తుత డిమాండ్‌ను అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పాటు వ్యాక్సినేషన్ సందర్భంగా సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలుగకుండా చూసుకోవడం కూడా ముఖ్యంగా మారింది. కాబట్టి వ్యాక్సినేషన్‌ను వారానికి రెండు రోజులు మాత్రమే నిర్వహించనున్నారు.

  షాకింగ్.. ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న నర్సుకు కరోనా పాజిటివ్!
  కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్రం ఏర్పాట్లు..

  కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్రం ఏర్పాట్లు..

  త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టనున్న కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కేంద్రం భారీ కసరత్తు చేస్తోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే డ్రైవ్‌లో 30 కోట్ల మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీకా ఇవ్వాలంటే పలు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. దీంతో ఇప్పటికే రాష్ట్రాల్లో కమిటీల ఏర్పాటుతో పాటు డ్రై రన్‌ల నిర్వహణ కూడా చేపడుతోంది. వ్యాక్సిన్‌ తరలింపు కోసం ప్రత్యేక విమానాలు, రైళ్లను, ఇతర వాహనాలను సిద్దం చేస్తోంది. వ్యాక్సిన్‌ పంపిణీపై జాతీయ స్ధాయి టాస్క్‌ ఫోర్స్‌తో పాటు రాష్ట్రాల టాస్క్‌ఫోర్స్‌లనూ సన్నద్ధం చేస్తోంది.

   క్రమంగా అందుబాటులోకి వ్యాక్సిన్

  క్రమంగా అందుబాటులోకి వ్యాక్సిన్


  ప్రస్తుతం భారత్‌లో వ్యాక్సిన్ సరఫరాకు అవకాశం ఇవ్వాలని కోరుతూ బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ- భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా కోరాయి. వీరితో పాటు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌, అమెరికాకు చెందిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ కూడా దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ప్రపంచంలో ఇప్పటికే అత్యధిక సంఖ్యలో వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ముందుగా టీకా సరఫరా అవకాశం దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫైజర్‌తో పాటు భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌కు కూడా అనుమతి ఇస్తారు. ఈ మూడు సంస్ధలు కలిపి సరఫరా చేసినా భారత్‌లో 30 కోట్ల డోసులు అందుబాటులోకి రావడం కష్టమేనన్న అంచనాలున్నాయి. దీంతో దశల వారీగా అయినా ఇచ్చేలా కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది.

  ఇతర వైద్య సేవలకు అంతరాయం లేకుండా

  ఇతర వైద్య సేవలకు అంతరాయం లేకుండా

  కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కేంద్రం ప్రకటిస్తుంది. అయితే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ సజావుగా సాగాలంటే దేశవ్యాప్తంగా లక్షలాది ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల సహకారం అవసరం. కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో ఆయా ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలను వదిలిపెట్టి వ్యాక్సిన్‌ పంపిణీ మాత్రమే చేపట్టే పరిస్ధితి లేదు. దీంతో సాధారణ వైద్య సేవలను కొనసాగిస్తూనే వ్యాక్సిన్‌ పంపిణీకి షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ వైద్య సేవలకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను కోరింది. దీంతో రాష్ట్రాలు కూడా రద్దీ లేని ఆస్పత్రులను, ఇతర ఆరోగ్య కేంద్రాలను వ్యాక్సినేషన్‌కు సిద్దం చేసే పనిలో ఉన్నాయి

  వారానికి రెండు రోజులే టీకా

  వారానికి రెండు రోజులే టీకా

  కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే డిమాండ్‌, సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేసుకోవాలంటే వారంలో కేవలం ఒకటి లేదా రెండు రోజుల పాటు మాత్రమే టీకా ఇచ్చే అవకాశం ఉందని కేంద్రం చెబుతోంది. అంతకు మించి ఎక్కువ రోజులు టీకా ఇచ్చే కార్యక్రమం పెడితే సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలుగవచ్చని పేర్కొంటోంది. మరోవైపు టీకాను కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే దాని తయారీ సంస్ధలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటాయి. వెంటవెంటనే ఈ ప్రక్రియ సాగినా రాష్ట్ర్లాలకు చేరి సురక్షితంగా వ్యాక్సినేషన్‌ సాగేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ మొత్తం వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను రెండు నెలల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

  English summary
  The union health ministry officials in the know say states may initially conduct the actual vaccination drive no more than once or twice a week. This is both to ensure that routine immunisation and other health services do not suffer during the drive as well as for logistical reasons.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X