వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలే ఆదాయం పడిపోయిన వేళ.. రాష్ట్రాలకు గడ్కరీ ట్విస్ట్.. రూ.20లక్షల కోట్లు సమకూర్చాలని..

|
Google Oneindia TeluguNews

అసలే కరోనా లాక్ డౌన్ కారణంగా బొటాబొటీ ఆదాయంతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల ఉద్దీపన ప్యాకేజీకి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో మరో రూ.10లక్షల కోట్లు పొందవచ్చునని.. తద్వారా మొత్తం రూ.50లక్షల కోట్ల ప్యాకేజీని సమకూర్చుకోవచ్చునని చెప్పారు.

 లైట్ తీసుకున్నందుకు భారీ మూల్యం.. 22 మందికి కరోనా పాజిటివ్.. అక్కడినుంచే వ్యాప్తి..? లైట్ తీసుకున్నందుకు భారీ మూల్యం.. 22 మందికి కరోనా పాజిటివ్.. అక్కడినుంచే వ్యాప్తి..?

ఎలాగైనా అధిగమిస్తామన్న గడ్కరీ..

ఎలాగైనా అధిగమిస్తామన్న గడ్కరీ..

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని నితిన్ గడ్కరీ అన్నారు. నిరుద్యోగ రేటు పెరిగిపోతోందని,వ్యాపారాలు మూతపడుతున్నాయని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. వలస కూలీలు,మీడియా,వ్యాపారవేత్తలు,ఉద్యోగులు.. ఇలా ప్రతీ ఒక్కరిపై ప్రభావం పడిందన్నారు. అయితే ఎలాగైనా మనం కరోనా వార్‌ను,ఎకనమిక్ వార్‌ను జయించి తీరుతామని చెప్పారు.

రాష్ట్రాలకు ట్విస్ట్..

రాష్ట్రాలకు ట్విస్ట్..

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే మార్కెట్లోకి మరింత ద్రవ్య లభ్యతను పంప్ చేయాల్సి ఉంటుందన్నారు గడ్కరీ.ఇందుకోసం రాష్ట్రాలన్నీ కలిసి రూ.20లక్షల కోట్లు సమకూర్చాలని.. అలాగే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో మరో రూ.10కోట్లు సమకూర్చుకోవచ్చునని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి ఇవి తోడైతే మొత్తం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ధీటుగా ఎదుర్కోవచ్చునని చెప్పారు. అయితే అసలే ఆదాయం లేక కేంద్రం నుంచి డబ్బులు అడుగుతున్న రాష్ట్రాలను రూ.20లక్షలు కోట్లు సమకూర్చమనడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో..!!

రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో..!!


కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు విడతలవారీగా ఈ ప్యాకేజీని ప్రకటించింది. అయితే ఇదంతా జుమ్లా అని,ఇందులో కేంద్రం ప్రత్యక్షంగా ఇచ్చేది రూ.2లక్షల కోట్లకు మించవన్న విమర్శలు కూడా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఈ ప్యాకేజీపై మీడియా ముఖంగా విరుచుకుపడ్డారు. ఇది వట్టి డొల్ల అని,బోగస్ ప్యాకేజీ అని చెప్పారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో రాష్ట్రాలకు నగదు ఇవ్వకుండా.. పైగా ఇచ్చే డబ్బులకు సైతం పలు ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పు పట్టారు. తాజాగా నితిన్ గడ్కరీ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

English summary
More liquidity is needed to boost economic activity following the coronavirus pandemic and states should come forward with Rs 20 lakh crore, while another Rs 10 lakh crore can be harnessed from public-private investment to fight the COVID-19 disruptions, Union Minister Nitin Gadkari said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X