• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, చెల్లించే బాధ్యత రాష్ట్రాలదే : సుప్రీంకు కేంద్రం, గైడ్ లైన్స్ ఇవే !

|

కరోనా మహమ్మారి కారణంగా భారత దేశంలో లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కోవిడ్ బారినపడి మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరుపుతున్న నేపథ్యంలో కేంద్రం గతంలోనే కరోనా మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల పరిహారం ఇవ్వలేమని చెప్పింది. ఇక తాజాగా కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాల నుండి 50,000 రూపాయల ఎక్స్‌గ్రేషియా లభిస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

భారత్ కు బిగ్ రిలీఫ్ .. బాగా తగ్గిన కరోనా కొత్త కేసులు, మరణాలు; తగ్గిన యాక్టివ్ కేసులు.. లెక్కలివే !!భారత్ కు బిగ్ రిలీఫ్ .. బాగా తగ్గిన కరోనా కొత్త కేసులు, మరణాలు; తగ్గిన యాక్టివ్ కేసులు.. లెక్కలివే !!

కరోనా మృతుల కుటుంబాలకు 50 వేల పరిహారం , భవిష్యత్ లో మృతి చెందే వారికి పరిహారం
సుప్రీంకోర్టు గతంలో కరోనా పరిహారంపై ఆదేశం తరువాత, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కోవిడ్ -19 మరణాల కోసం ఎక్స్-గ్రేషియాపై మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర విపత్తు ఉపశమనం నుండి కోవిడ్ -19 తో మరణించిన వారి కుటుంబాలకు రూ .50 వేలు చెల్లించాలని సిఫార్సు చేసింది. ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళింది. ఇప్పటికే సంభవించిన మరణాలకు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో జరిగే మరణాలకు కూడా పరిహారం చెల్లించబడుతుందని కేంద్ర సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది.ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయని , రాష్ట్ర ప్రభుత్వాల సంబంధిత విపత్తు ప్రతిస్పందన నిధుల నుండి ఈ పరిహారాలు చెల్లించబడతాయి అని, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ లేదా జిల్లా పరిపాలన ద్వారా కుటుంబాలకు పంపించబడతాయని ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.

States To Provide ₹ 50,000 Compensation For Each Covid Death: Centre to Supreme court

కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటి వరకు 4.45 లక్షలకు పైగా మృతులు
మహమ్మారి 2020 జనవరిలో సంభవించినప్పటి నుండి భారతదేశంలో 4.45 లక్షలకు పైగా కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఎన్నో కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయి దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలోనే సుప్రీం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్న కేంద్రం ఎక్స్ గ్రేషియా 50 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కోవిడ్ -19 మహమ్మారి యొక్క భవిష్యత్తు దశలలో సంభవించే మరణాలకు కూడా పరిహారం అందించబడుతుంది అని అఫిడవిట్ పేర్కొంది.

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం క్లెయిమ్ కు దరఖాస్తు ఇలా
కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొన్న, కరోనా నియంత్రణ కార్యకలాపాలలో పాల్గొన్న మరణించిన వారి కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వబడుతుందని ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాల ప్రకారం మరణానికి కారణం కరోనా మహమ్మారి గా ధృవీకరించబడాలని కేంద్రం పేర్కొంది. కరోనా కారణంగా మృతి చెందిన, బాధిత కుటుంబాలు తమ క్లెయిమ్‌లను రాష్ట్ర అధికారులు జారీ చేసిన ఫారమ్‌తో పాటు నిర్ధిష్ట డాక్యుమెంట్‌లను , మరణానికి కారణాన్ని ధృవీకరించే పత్రాన్ని సమర్పించాలని కేంద్రం పేర్కొంది.జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు క్లెయిమ్, ధృవీకరణ, మంజూరు మరియు పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారని సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్ళింది.

30 రోజుల్లో బ్యాంక్ ఖాతాకు నేరుగా నగదు బదిలీ .. గ్రీవెన్స్ కు జిల్లాల స్థాయిలో కమిటీ
కోవిడ్ మృతుల కుటుంబాలు అవసరమైన పత్రాలను సమర్పించిన 30 రోజుల్లోపు అన్ని క్లెయిమ్‌లు పరిష్కరిస్తుందని, ఆధార్‌తో అనుసంధానించబడిన బ్యాంక్ అకౌంట్ కు నేరుగా డబ్బులను బదిలీ చేయడం ద్వారా పంపిణీ చేస్తుందని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. ఒకవేళ పరిష్కారం కాని గ్రీవెన్స్‌లు ఏవైనా ఉంటే, అదనపు జిల్లా కలెక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ , అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ , మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ లేదా మెడిసిన్ హెడ్‌తో కూడిన జిల్లా స్థాయి కమిటీలతో నిర్వహించబడతాయని కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో వెల్లడించింది. కమిటీ, వాస్తవాలను ధృవీకరించిన తర్వాత, సవరించిన అధికారిక పత్రాల జారీతో సహా అవసరమైన చర్యలను ప్రతిపాదిస్తుందని పేర్కొంది. కమిటీ నిర్ణయం పరిహారం క్లెయిమ్‌కు అనుకూలంగా లేనట్లయితే, దానికి స్పష్టమైన కారణం నమోదు చేయబడుతుంది అని అఫిడవిట్ ద్వారా కేంద్రం పేర్కొంది.

English summary
The Center told the apex court that the families of those who died due to corona would get an ex-gratia of Rs 50,000 from the state governments. The Center said that these funds would be paid by the state governments from the disaster response funds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X