వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆడా ఉంటా ఈడా ఉంటా.. గుజ‌రాత్ బాష లెక్క ..! రెండు చోట్ల పోటీ చేసేందుకు మోదీ స‌న్నాహాలు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : గ‌త ఎన్నిక‌ల్లో న‌రేంద్ర‌మోడీ గుజ‌రాత్‌లోని వడోద‌రా, ఉత్త‌ర‌ప్ర‌దే్శ్‌లోని వార‌ణాసి నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో విజ‌యం సాధించారు. త‌ర్వాత వ‌డోద‌రా స్థానాన్ని వ‌దులుకుని వార‌ణాశి నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. ఒడిశాలో అధికారం చేజిక్కించుకునేందుకు అమిత్ షా వ్యూహం ర‌చిస్తున్నారు. అందుకోసం ప్ర‌ధాని మోదీని అక్క‌డ నుంచి పోటీ చేయించే అంశం పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఒడిశాలో ప్ర‌భావం చూపాలి..! ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపి..!!

ఒడిశాలో ప్ర‌భావం చూపాలి..! ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపి..!!

ఒడిశాలోని పూరి లోక్‌స‌భ నుంచి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పోటీ చేసేందుకు యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు పార్టీ కోర్‌క‌మిటీలో విస్తృత చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. గ‌తంలో పోటీ చేసి గెలుపొందిన వార‌ణాసితోపాటు పూరి నుంచి కూడా బ‌రిలోకి దిగాల‌ని మోడీ యోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ధాని నియోజ‌క‌వ‌ర్గం మారితే ఆ ప్ర‌బావం ఎలా ఉంటుంద‌న్న దానిపై బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ఓ స‌ర్వే కూడా చేయించిన‌ట్టు తెలుస్తోంది.

 మోదీ ఛ‌రిష్మాతో ఎక్కువ లోక్ సీట్లు సాధించాలి..! ప‌ట్టుద‌ల‌గా ఉన్న క‌మ‌లం పార్టీ..!!

మోదీ ఛ‌రిష్మాతో ఎక్కువ లోక్ సీట్లు సాధించాలి..! ప‌ట్టుద‌ల‌గా ఉన్న క‌మ‌లం పార్టీ..!!

ఇందులో బీజేపీకి అనుకూల ఫ‌లితాలు రావ‌డంతో పోటీ విష‌యంలో నిర్ణ‌యం తీసుకునే అధికారాన్ని న‌రేంద్ర మోడీకే వ‌దిలేసింది బీజేపి. మోదీ ప్ర‌భావాన్ని ఉప‌యోగించుకుని ఒడిశాలో సాద్య‌మైన‌న్ని ఎక్కువ లోక్ స్థానాలు కైవ‌సం చేసుకోవాల‌ని బీజేపి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. అంతే కాకుండా రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌టంతో అక్క‌డ అధికారం చేజిక్కించుకొనే దిశ‌గా బీజేపి పావులు క‌దుపుతోంది. ఒడిశా లో అదికారంలోకి రావ‌డానికి ఇప్ప‌టినుండే బీజేపి అదిష్టానం ప్రయ‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తోంది.

చంద్ర‌బాబు ల‌క్ష్యంగా : సీయంగా జ‌గ‌న్ కు నోఛాన్స్ : కేసీఆర్ వ్యూహం ఇదే: శివాజీ ప్ర‌జెంటేష‌న్..!చంద్ర‌బాబు ల‌క్ష్యంగా : సీయంగా జ‌గ‌న్ కు నోఛాన్స్ : కేసీఆర్ వ్యూహం ఇదే: శివాజీ ప్ర‌జెంటేష‌న్..!

 రాష్ట్రాల వారీగా అమీత్ షా ప‌ర్య‌ట‌న‌లు..! పొత్తులపై ఆచితూచి అడుగేస్తున్న బీజేపి..!!

రాష్ట్రాల వారీగా అమీత్ షా ప‌ర్య‌ట‌న‌లు..! పొత్తులపై ఆచితూచి అడుగేస్తున్న బీజేపి..!!

ఈ సారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌న్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌న్న ప్ర‌చారంతోపాటు ఇటీవ‌ల మూడు రాష్ట్రాల్లో ఓట‌మితో పార్టీలో అంత‌ర్మ‌థ‌నం జ‌రిగింది. తాజాగా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌తో బీజేపీకి మ‌రోసారి అనుకూల వాతావ‌రణం ఏర్ప‌డింది. అయిన‌ప్ప‌టికీ బీజేపీ గ‌తంతో పోల్చితే సీట్లు కోల్పోయే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారంతో పొత్తుల విష‌యంలో రాష్ట్రాల వారీగా ప‌ర్య‌టిస్తూ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా పార్టీ గెలుపుకోసం వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు.

పూరి లోక్ స‌భ నుంచి మోదీ పోటీ..? తుది నిర్ణ‌యం ఆయ‌నకే వ‌దిలేసిని బీజేపి..!!

పూరి లోక్ స‌భ నుంచి మోదీ పోటీ..? తుది నిర్ణ‌యం ఆయ‌నకే వ‌దిలేసిని బీజేపి..!!

మ‌రోవైపు కీల‌క నేత‌ల పోటీ విష‌యంపై పార్టీలో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది.ఇందులోభాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈసారి ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. పార్టీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆయ‌న్ను ఒడిశా రాష్ట్రంలోని పూరి లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయించే విష‌యంపై కీల‌క చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టికే దీనిపై ఒడిశాలోని పూరి లోక్‌స‌భ స్థానంలోని పార్టీ వ‌ర్గాల‌తో స‌ర్వే నిర్వ‌హించ‌గా మోడీ గెలుపు ఖాయ‌మ‌న‌న్న దీమా వ్య‌క్తమైన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంలో మోడీనే తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉన్నందున ఆయ‌న నిర్ణ‌యం కోసం పార్టీ కోర్ క‌మిటీ ఎదురుచూస్తున్న‌ట్టు తెలుస్తోంది. అన్నీ క‌లిసొస్తే ఈ సారి కూడా మోదీ రెండు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌నుండి పోటీ చేస్తార‌నే చ‌ర్చ ఊపందుకుంది.

English summary
Amit Shah's strategy to gain power in Odisha. Prime Minister Modi has been working on the subject of contesting from there. There is a discussion in the party that Modi is likely to take a crucial decision on the next Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X