వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ బ్రాండ్ అంబాసిడర్‌గా జర్మనీ టెన్నిస్ స్టార్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: 'స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా'గా కేరళకు పేరు. బ్రాండ్ అంబాసిడర్ ఎన్నికైన స్టెఫీగ్రాఫ్ ఆ రాష్ట్రానికి మరింత స్పైస్‌ను జోడించనుంది. సుమారు రెండు దశాబ్దాల పాటు తన ఆటతో అభిమానులను అలరించిన 46ఏళ్ల స్టెఫీ గ్రాఫ్‌ను కేరళ ప్రభుత్వం ఆయుర్వేద బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. 'విజిట్స్ కేరళ స్కీమ్'‌లో భాగంగా స్టెఫీ గ్రాఫ్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు కేరళ పర్యాటక సంస్ధకు అనుమతిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Steffi Graf appointed as Brand Ambassador of Ayurveda in Kerala

జర్మనీకి చెందిన ఈ టెన్నిస్ దిగ్గజం కేరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను సాధించింది. ప్రపంచ మాజీ నెంబర్ వన్ అయిన స్టెఫీ గ్రాఫ్ 1999లో టెన్నిస్‌కు గుడ్ బై చెప్పింది. ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆటగాడు ఆండ్రూ ఆగస్సీని అక్టోబర్, 2001లో వివాహం చేసుకుంది.

అంతక ముందు కేరళ ప్రభుత్వం షారుక్ ఖాన్‌తో కూడా చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఏది అయితేనేం చివరకు స్టెఫీ గ్రాఫ్ వైపే కేరళ ప్రభుత్వం మొగ్గు చూపింది.

English summary
If Kerala is called the ‘Spice Garden Of India’, then this new brand ambassador will surely add to the Spice content of the place. Tennis glam girl Steffi Graf has reportedly been appointed the ambassador of Kerala tourism and will specifically work to take Ayurveda to the masses across the world. The decision was announced by state chief minister Oommen Chandy on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X