వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత క్రూరమా?: తూత్తుకుడి ఘటనపై రజినీ ఆగ్రహం, కమల్‌పై కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తూత్తుకుడి ఘటనపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. 'స్టెరిలైట్‌ ఆందోళనకు రాజకీయాల్ని కలిపి, ప్రభుత్వం ఇంటలిజెన్స్‌‌ డిపార్ట్‌మెంట్‌ను దుర్వినియోగం చేసింది. భద్రతా బలగాలు క్రూరంగా ప్రవర్తించడాన్ని నేను ఖండిస్తున్నా. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని రజనీ పేర్కొన్నారు.

ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్‌లో స్పందించారు. తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కాపర్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలో 12 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కాపర్‌ కర్మాగారంతో పరిసరాల్లో జలాలు కలుషితం అవుతున్నాయని, దీన్ని మూసివేయాలని గత కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 గ్రామాలకు చెందిన సుమారు 20 వేల మంది ఆందోళనలో పాల్గొన్నారు.

కలెక్టర్‌ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు మధ్యలోనే వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పేలా కనిపించడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. అనంతరం పోలీసులు కాల్పులు జరపగా 12 మంది మృతి చెందారు. మరో 60 మందికిపైగా గాయడాపడ్డారు.

Sterlite protest in Thoothukudi: Rajnikanth posts video condemning govts careless attitude

బాధితులకు కమల్ పరామర్శ: కేసు నమోదు

స్టెరిలైట్‌ ఆందోళనలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మక్కల్‌ నీధి మయ్యమ్‌ పార్టీ అధినేత, తమిళ నటుడు కమల్‌హాసన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు ఉన్న ట్యుటికోరిన్‌ హాస్పిటల్‌ వద్ద 144సెక్షన్‌ ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున మద్దతుదారులతో కమల్‌ వెళ్లారు. దీంతో 144 సెక్షన్‌ అమల్లో ఉండగా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కమల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Sterlite protest in Thoothukudi: Rajnikanth posts video condemning govts careless attitude

ఈ సందర్భంగా కమల్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఆందోళనకారులపై కాల్పులు జరపమని ఎవరు ఆదేశించాలో ప్రజలకు తెలియాలి. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడం దీనికి పరిష్కారం కాదు. ప్రజలు డిమాండ్‌ చేస్తున్నట్లుగా ఈ కంపెనీని తప్పకుండా మూసేయాలి' అని డిమాండ్ చేశారు.

ఇది ఇలా ఉండగా, తూత్తుకుడి ఘటనకు బాధ్యులను చేస్తూ జిల్లా కలెక్టర్ ఎన్ వెంకటేశ్, ఎస్పీ తిరు పీ మహేంద్రన్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. విశ్రాంత న్యాయమూర్తితో ఘటనపై విచారణకు ఆదేశించింది.

English summary
Actor-turned-politician Rajinikanth on Wednesday condemned the Tamil Nadu's government's "careless attitude" and "unlawful police firing" at the anti-Sterlite Copper Smelting plant protesters in Thoothukudi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X