వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాళ్లు, కత్తులతో ఎదురుతిరుగుతాం.. సీఏఏ నిరసనకారులకు రాజ్ ఠాక్రే వార్నింగ్.. ముంబైలో ఎంఎన్ఎస్ భారీ

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న నిరసనకారులను ఉద్దేశించి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీపై నాటకాలు ఆపకుంటే రాళ్లకు బదులు రాళ్లు, కత్తులకు బదులు కత్తులతోనే జవాబిస్తామని, ఎక్కడిక్కడ నిరసన ర్యాలీలను అడ్డుకుంటామని ఆయన హెచ్చిరించారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ ఆగాధి ప్రభుత్వం సీఏఏపై భిన్నంగా స్పందించిన నేపథ్యంలో రాజ్ ఠాక్రే ప్రకటన కీలకంగా మారింది.

భారీ ర్యాలీ..
రాజ్ ఠాక్రే సారధ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ఆదివారం ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించింది. సౌత్ ముంబైలోని గిర్గాం చౌపట్టి నుంచి ఆజాద్ మైదానం వరకు సాగిన పాదయాత్రలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్ ఠాక్రే భార్య షర్మిల, కొడుకు అమిత్ ఠాక్రే కూడా కార్యక్రమానికి హాజరుకావడం గమనార్హం. ర్యాలీ తర్వాత ఆజాద్ మైదానంలో ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి ఠాక్రే ఉద్వేగంగా ప్రసంగించారు.

 Stones to be Answered with Stones: Raj Thackeray warns anti caa protesters

కత్తకి కత్తితోనే..
''సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సమాధానమే ఇవాళ్టి ఎంఎన్ఎస్ ర్యాలీ. ఇప్పటి నుంచి నిరసనల్ని అడ్డుకోవడమే మా పని. కేంద్రం చట్టాలపై ఇంకా డ్రామాలు చేయాలనుకునేవాళ్లకిదే నా హెచ్చరిక.. రాయికి రాయితో.. కత్తికి కత్తితోనే బదులిస్తాం.. అసలు మీరు ఎందుకు నిరసిస్తున్నారు? ఎవరి తరఫున మాట్లాడుతున్నారు? దేశం నుంచి అక్రమ వలసదారుల్ని వెళ్లగొడితే మీకొచ్చిన ఇబ్బందేంటి? అక్రమ వలసదారుల్ని ఇక్కడే ఉండాలనడానికి ఇండియా ఏమైనా ధర్మసత్రమా?''అని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు.

English summary
Addressing the gathering of thousands of MNS activists at the Maidan, Thackeray said, "henceforth, a stone will be answered with a stone and a sword with a sword"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X