వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాతో నేరుగా చర్చించు, జనాన్ని నా మీదకు ఎగదోయకు కేజ్రీవాల్ పై మండిపడ్డ వాద్రా

ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు మద్య మాటల యుద్దం సాగుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నాతో నేరుగా చర్చించు, జనాన్ని నా మీదకు ఎగదోయకు కేజ్రీవాల్ పై మండిపడ్డ వాద్రా
న్యూఢిల్లీ:'ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు మద్య మాటల యుద్దం సాగుతోంది. ఇద్దరి మద్య జరిగిన గొడవ బయటకు రాకపోయినా సోషల్ మీడియా వేదికగా రాబర్ట్ వాద్రా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరుగుతున్నారు.

శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగానే బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో అరవింద్ కేజ్రీవాల్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు.రాజకీయంగా బిజెపిని ఇరుకున పెట్టే కార్యక్రమాల్లో అరవింద్ ముందుంటారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కొన్ని కార్యక్రమాలకు అరవింద్ మద్దతిచ్చారు.కాంగ్రెస్ పార్టీతో కేజ్రీవాల్ కొంత సానుకూల దృక్పథంతోనే కొనసాగినట్టు కన్పిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీతో జతకట్టడంపై అరవింద్ పై బిజెపి తీవ్ర విమర్శలు చేసింది.

అయితే కాంగ్రెస్ పార్టీతో సానుకూల థృక్పథంతోనే ఉన్నప్పటికీ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాతో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మద్య విబేధాలు చోటుచేసుకొన్నట్టు కన్పిస్తోంది. ఈ విషయమై వాద్రా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

నాతో నేరుగా మాట్లాడండి, జనాన్ని ఎగదోయకండి:వాద్రా

నాతో నేరుగా మాట్లాడండి, జనాన్ని ఎగదోయకండి:వాద్రా

తనతో నేరుగా మాట్లాడాలని సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సూచించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయకూడదని ఆయన హితవు పలికారు.ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ వాల్ పేజీలో పోస్టు పెట్టారు. సుదీర్ఘమైన ఈ పోస్టులో వాద్రా అరవింద్ కేజ్రీవాల్ పై ఘాటైన పదజాలాన్ని ఉపయోగించి విమర్శలు గుప్పించారు. నా మీద ఆయనకు ఏమైనా కోపం ఉంటే నేరుగా తనతో మాట్లాడాలని ఆయన అరవింద్ కేజ్రీవాల్ కు సూచించారు.అంతేకాదు తనపై జనాన్ని ఎగదోయకూడదని ఆయన హెచ్చరించారు.

అరవింద్ కేజ్రీవాల్ డిక్షనరీలో ఎక్కువగా ఉపయోగించే పదం వాద్రానే

అరవింద్ కేజ్రీవాల్ డిక్షనరీలో ఎక్కువగా ఉపయోగించే పదం వాద్రానే

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించే డిక్షనరీలో ఎక్కువగా వినిపించే పదం రాబర్ట్ వాద్రానే అని ఆయన చెప్పారు. తనపై అరవింద్ కు ప్రత్యేక మైన ప్రేమ ఉన్నట్టుందని ఆయన అబిప్రాయపడ్డారు. వాద్రా వాళ్ళను సజీవంగా తినేస్తాడనే అభిప్రాయం వాళ్ళకు ఉన్నట్టుంది అందుకే తన పేరును తరచూ ఉచ్చరిస్తారని ఆయన తన ఫేస్ బుక్ పోస్ట్ లో రాశారు.చివరకు డిల్లీ ముఖ్యమంత్రి అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నానని చెప్పారు.

మా పనికి మోడీ అడ్డుతగులుతున్నారన్న అరవింద్

మా పనికి మోడీ అడ్డుతగులుతున్నారన్న అరవింద్

ఢిల్లీ ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టబెట్టినందుకుగాను ప్రధానమంత్రి మోడీ కక్ష తీర్చుకొన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తమ పనికి ప్రధాని మోడీ పదే పదే అడ్డు తగులుతున్నారని ఆయన చెప్పారు.కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసం తాము అనేక కార్యక్రమాలను చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ఆయన పరోక్షంగా మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు.

రాబర్ట్ వాద్రాపై భూ కుంభకోణం ఆరోపణలు చేసిన అరవింద్ కేజ్రీవాల్

రాబర్ట్ వాద్రాపై భూ కుంభకోణం ఆరోపణలు చేసిన అరవింద్ కేజ్రీవాల్

రాబర్ట్ వాద్రా పెద్ద భూ కుంభకోణంలో ఉన్నారని 2012 లో అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. డిఎల్ఎప్ కంపెనీ ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే భారీ మొత్తంలో రుణాలు ఇస్తే వాటితో ఆయన కోట్లాది రూపాయాల భూములు కొన్నారని అరవింద్ ఆరోపించారు. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు డిఎల్ఎఫ్ కు చేసిన మేలుకు ప్రతిఫలంగానే ఆ కంపెనీ ఆ సొమ్ము ముట్టజెప్పిందని అరవింద్ రాబర్ట్ వాద్రాపై విమర్శలు చేశారు. అలాగే 300 కోట్ల విలువైన భూమిని డిఎల్ఎప్ కంపెనీ రాబర్ట్ వాద్రాకు కారు చౌకగా ఇచ్చేశారని ఆయన కూడ ఆరోపించారు.

ఇంకా స్పందించని అరవింద్ కేజ్రీవాల్

ఇంకా స్పందించని అరవింద్ కేజ్రీవాల్

రాబర్ట్ వాద్రా, అరవింద్ కేజ్రీవాల్ మద్య గొడవకు కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.అయితే సోషల్ మీడియా వేదికగా రాబర్ట్ వాద్రా ఎందకు ఈ రకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారనే విషయమై అర్థం కావడం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలపై అరవింద్ ఇంకా స్పందించలేదు. ఈ విషయమై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.

English summary
I would humbly request our Delhi CM to come and speak with me directly, for all his grudges he has against me, instead of inciting other people against me," Robert Vadra wrote on his Facebook page.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X