వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ప్రధాని కాన్వాయ్‌పై పూలకుండి విసిరిన మహిళ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ కాన్వాయ్‌కి దారిచ్చేది లేదంటూ ఓ మహిళ అడ్డుపడి హల్ చల్ సృష్టించింది. దీంతో ప్రధాని మోడీ భద్రతా సిబ్బంది టెన్షన్‌కు గురయ్యారు. ఈ సంఘటన బుధవారం దేశ రాజధానిలోని సౌత్ బ్లాక్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే సౌత్ బ్లాక్‌లోని ప్రధాని ఆఫీసు నుంచి విధులను ముగించుకుని వెళ్తున్న సమయంలో ప్రధానిని కలవాలంటూ ఇద్దరు మహిళలు విజయ్ చౌక్ సమీపంలో హల్‌చల్ చేశారు. ప్రధాని కాన్వాయ్‌కు క్లియరెన్స్ ఇచ్చేది లేదంటూ నడిరోడ్డుపై బైఠాయించారు.

ప్రధాని మోడీ కాన్వాయ్‌కు అడ్డుపడి దారిచ్చేది లేదంటూ ఖరాఖండిగా తేల్చిచెప్పారు. ఊహించని పరిణామంతో ప్రధాని భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టాయి. ప్రధానికి వ్యతిరేకంగా నినాదలు చేస్తూ కాన్వాయ్ పైకి పూల కుండీని విసిరారు.

Stopped from meeting PM Modi, woman throws flower-pot on his convoy

మరొక మహిళ అయితే ప్రధాని కాన్వాయ్‌కి అడ్డుపడి మోడీకి దారిచ్చేది లేదంటూ ఎదురు తిరిగింది. రోడ్డుపైనే మహిళ ధర్నాకు దిగింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రధాని భద్రతా సిబ్బంది మహిళలిద్దరినీ అదుపులోకీ తీసుకున్నారు. ఆ తర్వాత ప్రధాని మోడీ కాన్వాయ్‌ని అక్కడ నుంచి క్షేమంగా పంపించివేశారు.

అయితే మహిళ ధర్నాకు దిగిన సందర్భంలో సౌత్ బ్లాక్ నుంచి విజయ్ చౌక్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మహిళను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ప్రధానిపై దాడి చేసేందుకే మహిళ వచ్చిందా అనే కోణంలో ఆమెను విచారిస్తున్నారు.

English summary
The SPG commandos guarding Prime Minister Narendra Modi faced some tense moments, Wednesday, when a woman threw a flower-pot at PM's convoy in the heart of the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X